Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాలకృష్ణకు విలన్‌గా మారిన జగపతి బాబు!?

బాలకృష్ణకు విలన్‌గా మారిన జగపతి బాబు!?
, మంగళవారం, 6 ఆగస్టు 2013 (16:32 IST)
FILE
ఒకప్పుడు కుటుంబ కథా చిత్రాల కథానాయకుడుగా శోభన్ బాబు స్థానాన్ని అధిష్టించిన జగపతిబాబు, ఇటీవల యువ కథానాయకుల దూకుడుతో తన శైలి మార్చారు. హీరోగానే కాకుండా ప్రాధాన్యమున్న పాత్రలను, విలన్ పాత్రలను సైతం పోషిస్తూ తన కెరీర్ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణకు ఆయన విలన్‌గా మారుతున్నారు.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న 'రూలర్' సినిమాలో జగపతిబాబు విలన్ గా కీలక పాత్ర పోషించడానికి అంగీకరించినట్టు తాజా సమాచారం. ఇందులో విలన్ పాత్ర స్టేచర్ వున్నది కావడంతో జగపతిని ఎంపిక చేసుకున్నట్టు, పాత్ర నచ్చడంతో ఆయన వెంటనే పచ్చ జెండా ఊపినట్టూ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగు హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది.

Share this Story:

Follow Webdunia telugu