Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాబాయ్‌ పవన్ కల్యాణ్ - అబ్బాయ్‌ రామ్ చరణ్‌తో ప్రణీత

బాబాయ్‌ పవన్ కల్యాణ్ - అబ్బాయ్‌ రామ్ చరణ్‌తో ప్రణీత
, గురువారం, 3 ఏప్రియల్ 2014 (10:54 IST)
WD
హీరోయిన్లు తండ్రీకొడుకులతో, బాబాయ్‌ అబ్బాయిల్తో నటిస్తుంటారు. అది స్క్రీన్‌ వరకే పరిమితం అనుకుంటారు. ఇప్పుడు నటి ప్రణీత కూడా అదే రూటులో ఉంది. సిద్దార్థ్‌ చిత్రం 'బావ'లో నటించినా.. అది పెద్దగా లాభంలేకపోయింది. ఆ తర్వాత మరో రెడు చిత్రాలు చేసింది. అవీ అలానే పోయాయి. లేటెస్ట్‌గా పవన్‌ కళ్యాణ్‌ చిత్రం 'అత్తారింటికి దారేది'లో అవకాశం వచ్చింది.

ఇంతవరకు బాగానే ఉంది. తాజాగా రామ్‌ చరణ్‌ చేయబోయే చిత్రంలో ప్రణీత నటిస్తోందని వార్తలు విన్పిస్తున్నాయి. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు లాంఛనంగా జరిగాయి. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇప్పటికే కేథరిన్‌ బుక్‌ అయింది. సెకండ్‌ హీరోయిన్‌గా ప్రణీత నటిస్తోందని సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu