Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫ్యాన్స్‌కు పండగరోజు..నేడు మహేష్ పుట్టినరోజు!

ఫ్యాన్స్‌కు పండగరోజు..నేడు మహేష్ పుట్టినరోజు!
, శుక్రవారం, 9 ఆగస్టు 2013 (11:47 IST)
FILE
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు తన జన్మదినోత్సవ వేడుకలు ఈరోజు లండన్‌లో గ్రాండ్‌గా జరుపుకోనున్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం '1 నేనొక్కడినే' భారీ షెడ్యూల్‌ చాలా రోజులుగా లండన్‌లో జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు '1' రెండో టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్‌లో మహేష్ న్యూ లుక్‌లో కనిపిస్తున్నాడు.

ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఈ టీజర్ బట్టి చూస్తే మహేష్ వెటాడే పులిలా కనిపిస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. మహేష్‌ సరసన నూతన నటి కృతిసనన్‌ నాయికగా నటిస్తోంది. ఇటీవలె ఈ సినిమా ఐటెం సాంగ్ ఈ చిత్రీకరించినట్లు తెలుస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu