ప్రిన్స్ బర్త్‌డే గిఫ్ట్... మాట్లాడలేదు కాని ఫైట్స్ చేస్తున్నాడు!
, శుక్రవారం, 9 ఆగస్టు 2013 (16:16 IST)
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు తన జన్మదినోత్సవ వేడుకలు ఈరోజు లండన్‌లో గ్రాండ్‌గా జరుపుకోనున్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం '1 నేనొక్కడినే' భారీ షెడ్యూల్ చాలా రోజులుగా లండన్‌లో జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు '1' రెండో టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్లో మహేష్ న్యూ లుక్‌లో కనిపిస్తున్నాడు.ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. ఈ టీజర్ బట్టి చూస్తే మహేష్ వెటాడే పులిలా కనిపిస్తున్నాడు. ఈ టీజర్‌ను మరింత స్టైలీష్‌గా, పవర్‌ఫుల్‌గా ఈ టీజర్‌ని తీర్చిదిద్దారు. ఈ టీజర్లో యాక్షన్ యాంగిల్‌ని సరికొత్త రీతిలో ప్రజెంట్ చేశారు. వన్ యాక్షన్ సినిమా అనే విషయాన్ని ఈ టీజర్లో ద్వారా చెప్పడానికి ప్రయత్నించారు. అయితే ఒక్కటే లోటు ఈసారి కూడా మహేష్ డైలాగ్ చెప్పలేదు. పంచ్ విసరలేదు. అయినా ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీ. వన్ తొలి టీజర్ లక్షల్లో తిలకించారు. ఆ రికార్డును అత్తారింటి దారేది టీజర్ బద్దలు కొట్టింది. పవన్ రికార్డును మహేష్ సరికొత్త టీజర్ తిరగరాస్తుందేమో చూడాలి.