Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పిల్లలపై నా ఆశల్ని రుద్ద లేదు... కానీ...: చిరంజీవి

పిల్లలపై నా ఆశల్ని రుద్ద లేదు... కానీ...: చిరంజీవి
, సోమవారం, 8 జులై 2013 (13:47 IST)
WD
పిల్లలపై తన ఆశల్ని ఏనాడూ రుద్దలేదని కేంద్రమంత్రి చిరంజీవి అంటున్నారు. పిల్లలు ఎంతో ఎత్తుకు ఎదగాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. తనకంటే గొప్పవాడుగా ఉండాలనీ, తనకురాని పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని ఆశిస్తుంటారు. వారికీ రకరకాల కోరికలుంటాయి. వాటిని తానెప్పుడూ తన పిల్లలపై రుద్దలేదని చిరంజీవి అంటున్నారు.

మకావులో జరుగుతున్న ఇంటర్నేషనల్‌ ఇండియన్ ఫిల్మ్‌ అకాడమీ అవార్డులో ఆయన పాల్గొని ప్రసంగించారు. చరణ్‌ తనకు తానుగా ఎదిగిన నటుడు. నటుడు అవుతాడని అనుకోలేదు. తెలుగులో నా స్థానాన్ని రామ్‌ చరణ్‌ భర్తీ చేశాడని చెప్పడానికి ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు.

ఇక తనకు ప్రస్తుతం సినిమా చేసే ఆలోచన లేదని అన్నారు. తక్కువ టైంలో చరణ్‌ హిందీలో కూడా నటించడం ఇదొక మార్పుగా పేర్కొన్నారు. దీనివల్ల దేశంలోని అభిమానుల్ని అలరించే అవకాశం వస్తుందని అన్నారు. పర్యాటక మంత్రి హోదాలో విదేశీయులు ఇక్కడికి షూటింగ్‌ నిమిత్తం వచ్చినప్పుడు ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu