'పిచ్చెక్కిస్తా' సినిమా ట్రెయిలర్ చూసి నిజంగానే పిచ్చెక్కినట్లుంది...
, బుధవారం, 2 ఏప్రియల్ 2014 (22:10 IST)
ఈ రోజుల్లో చిత్రం పుణ్యమా అని టీనేజ్ లవ్స్టోరీలపై రకరకాల కథల్తో సినిమాలు వచ్చేస్తున్నాయి. ఆ తరహా చిత్రాల్తో మారుతి బూతు చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. అందుకే అతనితో పెద్ద హీరోలు ఎవ్వరూ చిత్రాలు చేయడానికి సాహసించడంలేదు. కాగా, అటువంటి కాన్సెప్ట్‌తోనే 'పిచ్చెక్కిస్తా' అనే చిత్రం రాబోతుంది. రాజశేఖర్ లంక నిర్మాత. శ్రీకాంత్ బి.రెడ్డి దర్శకుడు. ఈ చిత్రం టీజర్ బుధవారం నాడు విడుదలైంది. ముఖ్య అతిథి నిర్మాత, నటుడు అశోక్ కుమార్ మాట్లాడుతూ.... ఇటీవలే చిన్న చిత్రాలు చూస్తుంటే జాలేస్తుంది. ఎవరో చెప్పిన మాటలు విని సినిమాలు తీస్తున్నారు. టైటిల్ వినగానే ఏదో అనిపించింది. నేను రానని చెప్పాను. ఎందుకంటే.. ఈ సినిమాలకు మేం ఏం చెప్పినా.. నెగెటివ్‌గా ఉంటుంది. కానీ రాకతప్పలేదు. ఈ చిత్ర ట్రైలర్ చూశాను. నిజంగానే పిచ్చెక్కినట్లుంది. రేపు థియేటర్లో కూడా జనాలు అలానే చూస్తే హిట్టే అని అన్నారు.