Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పవన్‌ కళ్యాణ్‌తో నటించేందుకు మహేష్‌ బాబు రె'ఢీ'

పవన్‌ కళ్యాణ్‌తో నటించేందుకు మహేష్‌ బాబు రె'ఢీ'
, శుక్రవారం, 7 జూన్ 2013 (14:49 IST)
WD
ఇటీవలే వెంకటేష్‌తో కలిసి నటించిన మహేష్‌ బాబు తాజాగా పవన్ కళ్యాణ్‌తో కటిసి నటించడానికి ముందుకు వస్తున్నాడు. బుధవారంనాడు విజయవాడలోని రెయిన్‌బో పిల్లల ఆసుపత్రి ప్రారంభించడానికి హాజరైన మహేష్‌ అక్కడ విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు.

ఓ ప్రశ్నకు సమాధానంగా పవన్‌కు నాకు సెట్టయ్యే కథ కుదిరితే తప్పకుండా నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశాడు. ఇప్పటికే వారిద్దరి కాంబినేషన్‌పై ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.

ఒకవేళ కలిస్తే ఎలాంటి కథ వస్తుందో అనే ఆసక్తి ఇరు హీరోల అభిమానుల్లోనూ ఉంది. మరో విశేషం ఏమంటే.. బాలీవుడ్‌లో నటించే ఆలోచన ప్రస్తుతానికి లేదని స్పష్టం చేశాడు మహేష్. అంటే ఆ తర్వాత నటిస్తాడన్నమాట.

Share this Story:

Follow Webdunia telugu