Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నితిన్ 'హార్ట్ ఎటాక్'... పూరీ ప్రేమలో పడ్డాడట!

నితిన్ 'హార్ట్ ఎటాక్'... పూరీ ప్రేమలో పడ్డాడట!
, శుక్రవారం, 10 జనవరి 2014 (11:22 IST)
FILE
పూరీ జగన్నాథ్ ఇప్పుడు ప్రేమలో పడ్డాడట. ఈ వయసులో ఆయనకు ప్రేమా అని ఆశ్చర్యపోకండి. ఆయన ప్రేమలో పడింది లవర్‌బాయ్ నితిన్‌తోనట. ఈ విషయాన్ని పూరీ జగన్నాథే వెల్లడించాడు. నితిన్- పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తోన్న 'హార్ట్ ఎటాక్' ఆడియో రిలీజ్ సందర్భంగా పూరీ పై విధంగా మాట్లాడాడు.

నితిన్‌తో లవ్‌లో ఉన్నాను. అంత బాగా నటించాడు. గతంలో నితిన్ అంటే వ్యక్తిగతంగా ఇష్టపడేవాడిని. అయితే అతనితో సినిమా చేయడం మొదలు పెట్టినప్పటి నుంచీ అతనిని ప్రేమించడం మొదలుపెట్టాను. అంతగా తను మనవాడైపోతాడు! అసలు అతనితో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అది ఇప్పటికి వర్కౌట్ అయింది" అన్నాడు పూరీ. వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందిన 'హార్ట్ ఎటాక్' సినిమా ఆడియోను తాజాగా హైదరాబాదులో విడుదల చేశారు. ఈ సందర్భంగా పూరీ అలా చెప్పుకొచ్చాడు!

Share this Story:

Follow Webdunia telugu