నితన్ : రొమాన్స్, కామెడీ సినిమాలు నా ట్రెండ్, మల్టీస్టారర్....?
, సోమవారం, 6 మే 2013 (11:55 IST)
ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలతో మంచి హిట్ సాధించిన యంగ్ హీరో నితిన్ ఇప్పుడు కథల విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటున్నాడట. లవ్, రొమాన్స్, కామెడీ కథలైతేనే చెప్పండి అంటూ దర్శకులకు ఆర్డర్ వేస్తున్నాడట నితిన్. మాస్ పాత్రలు చేసి ఎంత తప్పు చేశాడో ఇప్పటికైనా అర్థమైనట్లుంది మనోడికి. అందుకే ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడు.ఇంకా మల్టీస్టారర్ కథలైనా ఫర్వాలేదు అంటున్నాడు. కథ నచ్చితే నా పాత్ర గురించి పట్టించుకోను అని చెబుతున్నాడట ఈ యంగ్ హీరో. ప్రస్తుతం 'మల్టీస్టారర్' సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. ఇద్దరు, ముగ్గురు హీరోలు కలిసి చేస్తే ఆ క్రేజ్ వేరేగా ఉంటుందని. నాకు అలాంటి అవకాశాలు వస్తే బాగుంటుందని అంటున్నాడు నితిన్. అయితే నితిన్ కల నెరవేరుతుందో లేదో చూడాలి మరి.