Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నా సినీ ప్రస్థానాన్ని రామ చరణ్ కొనసాగిస్తాడు : చిరు

నా సినీ ప్రస్థానాన్ని రామ చరణ్ కొనసాగిస్తాడు : చిరు
, శుక్రవారం, 30 డిశెంబరు 2011 (11:57 IST)
File
FILE
తన వెండితెర ప్రస్థానాన్ని తనయుడు రామ్ చరణ్ తేజ్ కొనసాగిస్తాడని మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. తన 150వ చిత్రంలో నటించే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలిపారు. ఈ చిత్రంలో నటించేందుకు తాను పచ్చజెండా ఊపితే ఆ చిత్రాన్ని తీసేందుకు పలువురు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. వీరిలో రామ్ చరణ్ కూడా ఒకరని చెప్పారు.

గురువారం రాత్రి నెల్లూరులో జరిగిన ఒక కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ తన బలం, బలహీనత రెండూ అభిమానులేనన్నారు. తాను పదవుల కోసం ఏనాడు వెంపర్లాడలేదన్నారు. వాటికోసం నేల విడిచి సాము చేయబోనని చెప్పారు. ఏ పదవి ఇచ్చినా స్వీకరించి పార్టీ పటిష్టత కోసం పని చేస్తానని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu