Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దుమ్మురేపుతున్న 'లెజెండ్' ఫస్ట్ టీజర్.. బాలయ్య ఖుషీ!

దుమ్మురేపుతున్న 'లెజెండ్' ఫస్ట్ టీజర్.. బాలయ్య ఖుషీ!
, గురువారం, 6 మార్చి 2014 (09:46 IST)
WD
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 'లెజెండ్' సినిమా ఆడియోను అత్యంత వైభవంగా మార్చి 7న, శిల్పకళావేదికలో విడుదల చేయనున్నారు. 'సింహా' సినిమాతో హిట్టకొట్టిన బాలయ్య- బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న లెజెండ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.

వారాహి చలనచిత్ర సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపిచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి కొర్రపాటి సమర్పకులుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన రాధికా ఆప్టే, సొనాల్‌ చౌహాన్‌ నాయికలు.

'Lion is Back' అన్న క్యాప్షన్‌తో విడుదలైన 'లెజండ్' సినిమా లేటెస్ట్ లుక్ అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది. అలాగే, తాజాగా విడుదల చేసిన టీజర్ అయితే బాలయ్య అభిమానులను ఆనంద డోలికల్లో ఊగించింది. 'సింహా' రేంజిలో ఈ సినిమా కూడా అలరిస్తుందన్న నమ్మకం వారిలో ఏర్పడిపోయింది.

ఈ టీజర్ ఇప్పుడు ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తోంది. గతంలో బాలకృష్ణ సినిమాల విషయంలో ఎన్నడూ లేని విధంగా హిట్స్ పొందుతోంది. దీంతో దర్శక నిర్మాతలు ఫుల్ ఖుషీగా వున్నారు. తమ సినిమా విజయానికి ఇది నాంది పలుకుతోందని సంబరపడుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu