Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'తుఫాన్‌' సెప్టెంబరులో వస్తుందట...

'తుఫాన్‌' సెప్టెంబరులో వస్తుందట...
, గురువారం, 4 జులై 2013 (17:19 IST)
WD
రామ్‌ చరణ్‌ నటించిన బాలీవుడ్‌ చిత్రం 'జంజీర్‌'. దీన్ని తెలుగులో 'తుఫాన్‌'గా తీసుకువస్తున్నారు. అయితే ఈ చిత్రం హిందీ హక్కుల విషయంలో కొంత గందరగోళం ఏర్పడటంతో కొద్దికాలంగా విడుదల్లో జాప్యం జరుగుతోంది. మొత్తాన్ని ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు.

రెండు నెలల క్రితమే ఈ చిత్రం తెలుగు టీజర్‌ను విడుదల చేశారు. ఇప్పుడు ట్రైలర్‌ను విడుదల చేయడానికి ఈ నెల 6న సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పునీత్‌, సుమీత్‌ మెహ్రాలు నిర్మిస్తున్న ఈ చిత్రం హిందీ వెర్షన్‌ ట్రైలర్‌ కోసం ముంబైకు రామ్‌ చరణ్‌ వెళ్ళనున్నారు.

ఇది పూర్తిగా హిందీ చిత్రం కనుక అక్కడే విడుదల చేయడం బాగుంటుందని నిర్మాతలు వెల్లడించారు. తెలుగులో వచ్చే నెలలో ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. సంజయ్‌దత్‌తో పాటు పలువురు అగ్రతారాగణం నటించిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదల చేయనున్నట్లు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu