Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తమిళ, తెలుగు సినిమాలకు తేడా ఉంది... నేను గమనించిందదే: కాజల్

తమిళ, తెలుగు సినిమాలకు తేడా ఉంది... నేను గమనించిందదే: కాజల్
, బుధవారం, 6 ఫిబ్రవరి 2013 (18:09 IST)
FILE
అందాల రాశి కాజల్ అగర్వాల్ తమిళ సినిమాపై సూటిగా తన మనసులోని మాటను బయటపెట్టేసింది. తమిళ సినిమాల కంటే తెలుగు సినిమా మహిళలకు గౌరవం ఇస్తుందని కాజల్ అగర్వాల్ వ్యాఖ్యానించింది. దీంతో తమిళ ఇండస్ట్రీ కాజల్ అగర్వాల్‌పై చిర్రుబుర్రుమంటోంది.

తమిళంలో తుపాకీతో హిట్ కొట్టిన కాజల్ అగర్వాల్‌కు ఏమైందో ఏమోగానీ తమిళంలో హీరోయిన్లను కేవలం గ్లామర్‌గానే చూపిస్తారని, తెలుగు సినిమాల్లో మహిళల్ని మర్యాదపూర్వకంగా నడిపిస్తారని వెల్లడించింది.

తెలుగు చిత్ర సీమకు తమిళ ఇండస్ట్రీకి తేడా ఉందా? అనే ప్రశ్నకు కాజల్ అగర్వాల్ ఓ ఇంటర్వ్యూ ద్వారా సమాధానమిస్తూ.. తప్పకుండా తెలుగు-తమిళ ఇండస్ట్రీలకు తేడా ఉందని చెప్పింది. తెలుగు చిత్ర సీమకే తాను ప్రాధాన్యత ఇస్తానని వెల్లడించింది. తమిళ సినిమా కంటే... తెలుగు సినిమాలో హీరోయిన్లకు గౌరవం ఉంటుందని కాజల్ వ్యాఖ్యానించింది.

తమిళ సినిమాలో హీరోలకే ప్రాధాన్యత ఉంటుందని చెప్పింది. తనతో నటించిన తమిళ నటుల్లో తుపాకీ హీరో విజయ్ అంటే ఇష్టమని చెప్పింది. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టమని చెప్పుకొచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu