Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డ్రగ్స్ కేసులో దొరికిన త్రిష సినీ ప్రేమికుడు అభిషేక్‌

డ్రగ్స్ కేసులో దొరికిన త్రిష సినీ ప్రేమికుడు అభిషేక్‌
, శనివారం, 8 డిశెంబరు 2012 (16:44 IST)
WD
ఇటీవల తెలుగు సినిమారంగంలో డ్రగ్స్‌ మాఫియా వీరవిహారం చేస్తోంది. రవితేజ సోదరుడు ఇందుకు కేంద్రబిందువయ్యాడు. తాజాగా శనివారం ఉదయం అభిషేక్‌ అనే నటుడు డ్రగ్స్‌తో పోలీసులకు దొరికిపోయాడు. నువ్వువస్తానంటే నేనొద్దంటానాలో త్రిషను ప్రేమించే వ్యక్తిగా, డేంజ్‌ర్‌లో అల్లరి నరేష్‌తో పాటు నటించిన అభిషేక్‌కు గోవాలో హోటల్‌ వ్యాపారం ఉంది.

అక్కడ ఈ డ్రగ్స్‌ ముఠాతో సంబంధాలు ఏర్పడ్డాయని తెలిసింది. అక్కడ నుంచి హైదరాబాద్‌కు తీసుకువస్తుండగా శనివారంనాడు దొరికిపోయాడని పోలీసులు విలేకరుల సమావేశంలో చెప్పారు.

సినిమాల్లో పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ఈ రకంగా పెద్దవారితో పరిచయాలు ఏర్పరచుకునేందుకు ప్రయత్నించాడని తెలుస్తోంది. సిఐడీ కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ, జూబ్లీహిల్స్‌లో డ్రగ్స్‌ మాఫియా ఉందని ఓ కన్నువేశామని, తనిఖీల్లో అభిషేక్‌ దొరికాడని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu