Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టాలీవుడ్ నెంబర్‌ ఒన్‌ హీరో ఎవరు...?!!

టాలీవుడ్ నెంబర్‌ ఒన్‌ హీరో ఎవరు...?!!
WD
గత ఏడాది కంటే ఈ ఏడాది ఎక్కువ సినిమాలు విజయాలను చవిచూడలేకపోయాయి. గత సంవత్సరం కిలాడీ, అదుర్స్‌, నమోవెంకటేశ, కేడి, సింహా, వరుడు, శంభో శివ శంభో, డార్లింగ్‌, లీడర్ వంటివి ముఖ్యంగా వచ్చాయి. ఏదైనా సినిమా హిట్ అయితే చాలు.. నెంబర్ వన్ హీరో ఎవరనే చర్చ నడుస్తుంది. అయితే మెగాస్టార్‌ చిరంజీవి తర్వాత ఆ స్థానాన్ని ఇంకా ఎవరూ భర్తీచేయలేకపోయారు.

పవన్‌కళ్యాణ్‌, ఎన్‌.టి.ఆర్‌. మహేష్‌బాబు ఆ కోవలో వస్తారని చాలామంది భావించారు. అయితే ఎన్‌.టి.ఆర్‌.కు సక్సెస్‌లు లేకపోవడంతో మహేష్‌ మూడేళ్ళకుపైగా సినిమా చేయకపోవడంతో.. పవన్‌కళ్యాణ్‌‌దీ అదే పరిస్థితి కావడంతో ఆ స్థానం అలానే మిగిలిపోయింది. ప్రభాస్‌, అల్లు అర్జున్‌ వంటి యువ కథానాయకులున్నా ఆ స్థాయిని చేరాలంటే ఇంకాస్త చరిష్మా కావాలి.

2007లో వచ్చిన 'అతిథి' తర్వాత ఇప్పటివరకు మరో సినిమా మహేష్‌నుంచి రాకపోవడం ఆయన అభిమానులతోపాటు సగటు సినిమా ప్రియుల్నీ అసంతృప్తికి గురిచేసింది. మధ్యలో కూల్‌డ్రింక్‌ యాడ్‌లు చేస్తూ కోట్లాది రూపాయలు ఇక్కడే సంపాదిస్తున్నాడు. అయితే ఇండిస్ట్రీలో నెంబర్‌ 1. స్టామినాను అతనే దక్కించుకుంటాడని వార్తలు వచ్చాయి. మూడేళ్ళుగా సినిమా లేని మహేష్‌బాబు పారితోషికం 8 కోట్ల తీసుకుంటున్నాడని ఫిలిమ్ ఛాంబర్‌ వర్గాలు తెలియజేస్తున్నాయి.

మహేష్‌బాబు మాత్రం ఆమధ్యలో ఓ సందర్భంలో నెంబర్‌ 1. గురించి మాట్లాడుతూ.... చిత్రం చేయడం వరకే నా బాధ్యత. నెంబర్‌‌వన్‌గా ఎదగాలనీ ఆలోచన లేదనే చెప్పారు. నా దృష్టిలో చిరంజీవిగారే నెంబర్‌ 1 అని అన్నాడు. వాళ్ళ నాన్న కృష్ణ మాత్రం గతంలో ఓ మ్యాగజైన్‌ నిర్వహించిన పోటీలో 'సూపర్‌స్టార్‌'గా ఎదిగాడు. వ్యక్తిగతంగా కూడా మంచివాడుగా పేరుపొందిన కృష్ణకు అది లాభించింది.

ఇదిలావుంటే ఏడాదికి మూడు చిత్రాలు వరకూ చేస్తూ ఎప్పుడూ బిజీగా ఉండే ఎన్‌.టి.ఆర్‌. నెంబర్‌ 1 అయ్యే అవకాశం ఉందని పలువురు సినీప్రముఖులు విశ్లేషిస్తున్నారు. 'అదుర్స్‌' తర్వాత ఎన్‌.టి.ఆర్‌. 'బృందావనం' విడుదలకాబోతుంది. ప్రభాస్‌తో మున్నా దర్శకత్వం వహించిన వంశీ దర్శకుడు. ఆ ఎన్‌.టి.ఆర్‌. తర్వాత అంత స్టామినా ఉన్నవాడు. డైలాగ్‌ డెలీవరీలో డాన్స్‌లో యాక్టివ్‌గా పేరుపొందిన ఎన్‌.టి.ఆర్‌. తీసుకొనే పారితోషికం 7 కోట్లు. ఇదిగాక 40కోట్ల భారీ బడ్జెట్‌తో అశ్వనీదత్‌ నిర్మాతగా మెహర్‌ రమేష్‌దర్శకత్వంలోనిర్మిస్తున్న చిత్రం 'శక్తి.' వరుసగా చిత్రాలు చేయడంలో శ్రద్ధచూపించే ఎన్‌.టి.ఆర్‌. నెంబర్‌1 అవుతాడనే ఇండస్ట్రీ భావిస్తోంది.

ఇక పవన్‌ కళ్యాణ్‌ 'జల్సా' వంటి సూపర్‌హిట్‌ సినిమా తర్వాత పవన్‌కళ్యాన్‌ హీరోగా నటిస్తున్న సినిమా కొమరం పులి. ఈ సినిమా నిర్మాత సింగనమల రమేష్‌ చాలా ఇబ్బందులు పడ్డాడని వార్తలు వచ్చాయి. నెంబర్‌ 1 స్థాయికి చేరాలంటే వ్యక్తిగతం కూడా బేరీజు వేయాల్సి వస్తుంది. అందుకే కలెక్షన్ల రూపంలోకాకుండా వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

లక్ష్మీ నరసింహ తర్వాత హిట్‌ కోసం ఆవురావురంటున్న బాలకృష్ణ చేసిన సినిమా 'సింహా'. అంతకుముందు ఎన్నో ఫ్లాప్‌లు మూటగట్టుకున్నాడు. ఇక ఆయన హవా అయిపోయిందనుకున్న తరుణంలో సింహాతో విజృంభించాడు. అయితే మొదటివారం కలెక్షన్ల రికార్డును ఆయనే బ్రేక్‌ చేసుకోవడం విశేషం. యూత్‌ హీరోలు తీసుకుంటున్న రెమ్యునరకేషన్‌కంటే తక్కువే. అయితే ఒక్కో ఏరియా రైట్స్‌తీసుకోవడంతో ఇంచుమించు వారి పారితోషికానికి దగ్గరగానే ఉన్నాడని సమాచారం.

నాగార్జున 'కేడి' కింగ్‌వంటి టైటిల్స్‌తో ముందుకు వచ్చినా పెద్దగా ఆదరణ లేదు. ఒక్కో సినిమాకు నైజాం రైట్స్‌ను తీసుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. వెంకటేష్‌ తన రొటీన్‌ ఫార్ములా కుటుంబకథా చిత్రాలు తీస్తూ నమోవెంకటేశగా మార్కులు పొందినా... ఆయన ఎటువంటి పోటీకి నిలబడడు. తాను తన సినిమాలేనంటూ వేదాంతం వల్లిస్తుంటాడు మినహా నెంబర్‌1. అంటే.. రామానాయుడు కొడుక్కా పుట్టడమే నెంబర్ 1 అని అంటుంటాడు.

యువతలో క్రేజ్‌ ఉన్న అల్లు అర్జున్‌ 'వరుడు'గా తెరమీద కన్పించి ఆకట్టుకునేందుకు యత్నించినా.. వధువు బాగోకపోవడంతో వరుడు తిరస్కారానికి గురయింది. అల్లు అర్జున్‌ నాలుగుకోట్ల వరకు తీసుకుంటున్నాడు. ఛత్రపతి తర్వాత ప్రభాస్‌ పారితోషికం 4.5 కోట్లు. అంతకుముందు ఆయనతో సినిమాను తీసిన నిర్మాత ఇల్లునే పారితోషికంగా తీసుకున్నాడు.

జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మగుడి సమీపంలోగల ఆ ఇంటి వాల్యూనే 6కోట్లవరకు ఉంటుందని సమాచారం. ఇక ప్రతి సినిమాను హిట్‌తో 'కిక్‌' ఇచ్చే రవితేజ సైలెంట్‌గా సినిమాలు విజయాలు చేస్తూ.. తనపనేదో తానుచూసుకునే బాపతు. ఈ నెంబబర్‌ 1ల స్థానం జోలికిపోడు. ఇది తనకు సరిపడదని అంటాడుకూడా. శంభోశివశంభో తీసినా అది ఆశించిన విజయానికి నోచుకోలేదు. లేటెస్ట్‌గా వచ్చిన 'డాన్‌శీను' బ్రేక్‌ చేసింది. భారీ బడ్జెట్‌ అయినా ఆయన తీసుకున్నది 6కోట్ల రూపాయలే. దీనికి 18కోట్లు భారీ బడ్జెట్‌ అయింది. అయితే నిర్మాతలకు ఇంకా ఆశించిన స్థాయిలో లాభాలు పెద్దగా రాలేదు. సేఫ్‌ ప్రాజెక్ట్‌గా నిలిచింది.

ఇక మగధీరతో 78 సంవత్సరాల సినీచరిత్రను తిరగరాసిన రామ్‌చరణ్‌తేజ ఆ తర్వాత అంత ఆశించే చిత్రం చేయాలని ఉర్రూతలూగుతున్నారు. అత్యున్నత నిర్మాణ విలువలతో దర్శకత్వ ప్రతిభకు రాజమౌళి ఒక ట్రెండ్‌ సృష్టించారు. చేసింది రెండో చిత్రమే అయినా నాలుగు కోట్ల వరకు తీసుకుంటున్నాడన ఇసమాచారం. అయితే ఆయన తాజాగా నాగబాబుతో సినిమా చేస్తున్నారు. ఒకటి రెండుచిత్రాల హిట్‌లతో అంచనాకు రావడం కష్టమేనని ఇండస్ట్రీ భావిస్తోంది.

ఏది ఏమైనా ఇండస్ట్రీలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరు నెంబర్‌ 1 అనే దానికంటే సక్సెస్‌ సినిమాలు తీయాలనే నిర్మాతలు చూస్తున్నారనీ హీరోలుగా ఆ దిశగా ప్రయత్నిస్తున్నారని ప్రొడ్సూసర్స్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు ప్రసన్నకుమార్‌ అంటున్నారు. ప్రస్తుతం ఏ హీరో కూడా నెంబర్ 1 స్థాయిని బేరీజు వేయలేమని ఏడాదికి 3,4 చిత్రాలు తీసి కార్మికులకు పని కల్పించే హీరోనే నెంబర్‌ 1 అని డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సాగర్‌ అంటున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu