Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టాలీవుడ్ అగ్ర నిర్మాతలపై నట్టి కుమార్ ఫైర్

టాలీవుడ్ అగ్ర నిర్మాతలపై నట్టి కుమార్ ఫైర్
, బుధవారం, 7 సెప్టెంబరు 2011 (18:20 IST)
తెలుగు చలనచిత్రరంగంలో చిన్న చిత్రాలు తీసే నిర్మాతలు ఐదారుగురు పెద్ద నిర్మాతల చేతిలో బానిసలుగా బతకాల్సి వస్తుందనీ, వారి పెత్తనానికి ఫుల్‌స్టాప్‌ పెట్టేవరకు ఇకపై తాను సినిమాలు నిర్మించనని నిర్మాత నట్టికుమార్‌ అన్నారు.

చిన్న నిర్మాతలకు అన్యాయం జరుగుతుందనీ పలుసార్లు ధర్నాలు చేసిన ఈయన ఈసారి తనకే దిక్కులేకుండా పోయిందని వాపోయారు. ఇటీవలే జరిగిన ఫిలిం ఛాంబర్‌ ఎన్నికల్లో ఎగ్జిబిటర్‌ సెక్టార్‌ కోటాలో నట్టికుమార్‌ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.

చిన్నచూపు చూస్తున్నారు
అధ్యక్షునిగా ఎన్నికయినా కుర్చీకిచ్చే విలువ మనిషికి ఇవ్వడంలేదు. అగ్రవర్ణాలవారు చేతిలో కీలుబొమ్మలా పనిచేయాల్సి వస్తుంది. చాలా నిర్ణయాలు తెలియకుండానే జరిగిపోతున్నాయి. ఇండస్ట్రీలో పెద్దలుగా చెప్పుకొనేవారు చిన్న నిర్మాతల్ని చిన్నచూపు చూస్తున్నారు. సినిమాలు రిలీజ్‌ కావాలంటే వారు ప్రాపకం కావాల్సిందే. లేదంటే... విడుదల నాటికి థియేటర్లు కూడా ఇవ్వవద్దని చెబుతున్నారు. నేను కొన్ని పాత థియేటర్లను లీజుకు తీసుకుని బాగుచేసి ప్రదర్శిస్తున్నాను.

ఒకనాడు దిల్‌ రాజు ఆఫీసు నుంచి ఫోన్లు వచ్చాయి. నట్టికుమార్‌ సినిమాలకు థియేటర్లే ఇవ్వకండనీ... ఆయన లీజును రద్దు చేసుకోండి. లేదంటే మీరే స్వయంగా నడుపుకోండని వారికి చెప్పారు. నేను చెప్పేదొకటే... ఎగ్జిబిటర్లు.. నేనిప్పుడు వరకు పెట్టిన పెట్టుబడి... ఖర్చులు ఇచ్చేస్తే... నేను లీజు నుంచి తప్పుకుంటాను. లేదండే... పెద్దనిర్మాతలతో పోరాడతాను.. అన్నారు.

ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు
పెద్ద బేనర్‌లో సినిమాలు తీసి చిన్న చిత్రాలుగా చూపిస్తూ... ప్రభుత్వానికి రావాల్సిన కోట్లాది రూపాయలను ఆ ఆరుగురు నిర్మాతలు మింగేస్తున్నారు. సర్వీస్‌టాక్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ టాక్స్‌ కట్టకుండా మోసం చేస్తున్నారు. ఇందులో ఐఎఎస్‌ అధికారులు, ఆర్‌డిఓ., ఎం.ఆర్‌.ఓ.ల ప్రమేయం కూడా ఉంది. వారు లంచాలకు మరిగి ప్రభుత్వానికి తప్పుదోవ పట్టిస్తున్నారు. 'రోబో' చిత్రాన్ని లోబడ్జెట్‌ చిత్రంగా చూపించి టాక్స్‌ కట్టకుండా తప్పించుకున్నారు.

అన్నహజారే పేరు చెప్పేందుకు అర్హతలేదు
అన్నాహజరే అవినీతి వ్యతిరేక పోరాటం చేస్తుంటే.. తాము పతివ్రతలంగా చిత్రిస్తూ ఆయన పేరుతో పోరాటం చేస్తున్నట్లు కొందరు వచ్చారు. వారికి అసలు ఆయన పేరు ఉచ్చరించే అర్హత లేదు. ప్రభుత్వానికి కట్టాల్సిన టాక్స్‌లు కట్టకుండా అవినీతికి పాల్పడుతున్నవారు 45 రోజుల్లో తమ లెక్కల్ని అధికారులకు చూపించాలి. లేదంటే... కోర్టుకు వెళతాను. సిబిఐ విచారణకు ఆదేశిస్తానని.. హెచ్చరించారు.

Share this Story:

Follow Webdunia telugu