Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జగపతిబాబు చేసింది కరెక్ట్‌ కాదా...?

జగపతిబాబు చేసింది కరెక్ట్‌ కాదా...?
, శుక్రవారం, 9 ఆగస్టు 2013 (18:37 IST)
WD
నటుడు జగపతిబాబు ఇంకా కొందరి గుప్పెట్లో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఆయనతో పలువురు కొత్త దర్శకులు నిర్మాతలు ప్రధాన రోల్‌కింద చిత్రాలు ఎడాపెడా చేసేశారు. నట్టికుమార్‌ ఆయనతో సెంచరీ పూర్తి చేయిస్తానని శపథం చేశాడు. కానీ రానురాను ఆయన చిత్రాలు ఏమీ జనాల్ని ఆకట్టుకోకపోవడంతోపాటు అవకాశాలు కూడా రాలేదు.

కాగా, తాజాగా తాను నందమూరి బాలకృష్ణ చిత్రంలో విలన్‌గా చేస్తున్నట్లు మీడియా ముందుకు వచ్చాడు జగపతి బాబు. అయితే ఇక్కడే తప్పులో కాలేశాడా! అని ఇండస్ట్రీలో కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

బాలకృష్ణ సినిమా ప్రతిష్టాత్మకంగా పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో తీస్తున్నందున.... చిత్రం హైప్‌ రావాలంటే.. విలన్‌ ఎవరనేది సస్పెన్స్‌గా ఉంచితే చిత్రానికి మంచిపేరు వస్తుందనే కామెంట్లు విన్పిస్తున్నాయి. ముందుగా ఫలానా నటుడు విలన్‌ అని చెప్పడం వల్ల బిజినెస్‌పరంగా హైప్‌ రాకపోవడంతో పాటు... ఫ్యాన్స్‌లోనూ పెద్ద ఉత్సాహం లేదని తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu