Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'గబ్బర్ సింగ్' నుంచి 'గబ్బర్‌'కు ప్రమోషన్ కొట్టేసిన శృతిహాసన్!

'గబ్బర్ సింగ్' నుంచి 'గబ్బర్‌'కు ప్రమోషన్ కొట్టేసిన శృతిహాసన్!
, గురువారం, 9 జనవరి 2014 (15:56 IST)
FILE
పవన్ కల్యాణ్‌తో 'గబ్బర్ సింగ్' సినిమాలో నటించిన శృతి హాసన్‌కు ఆ సినిమా ఘనవిజయంతో గోల్డెన్ లెగ్ బ్యూటీగా పెరుతెచ్చకుంది. ఆ తర్వాత తెలుగు, హిందీల్లో వరుస సినిమాలు చేస్తూ వస్తోంది. తాజాగా శృతి మరో హిందీ సినిమాలో అవకాశం కొట్టేసింది.

ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా 'గబ్బర్' అనే హిందీ సినిమా రూపొందుతోంది. ఠాగూర్‌కి రిమేక్‌గా తీస్తున్న ఈ సినిమాలో శృతి హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ మూవీ కోసం ఎంతో మందిని పరిశీలించిన తర్వాత ఇందులో శృతిని హీరోయిన్‌గా ఎంచుకున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబయిలో జరుగుతోంది.

ఇటీవలే అపెండిసైటిస్ ఆపరేషన్ చేయించుకున్న ఈ లేతపరువాల భామ, తిరిగి పూర్తి ఆరోగ్యంతో ఇప్పుడు 'గబ్బర్' షూటింగులో జాయిన్ అయింది. మరోపక్క 'వెల్కం బ్యాక్' అనే మరో హిందీ సినిమాలో కూడా ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu