Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క్రేజీ స్టార్ ప్రభాస్ నా "డార్లింగ్": అల్లు అర్జున్

క్రేజీ స్టార్ ప్రభాస్ నా
ప్రభాస్ కథానాయకుడిగా కరుణాకరన్ దర్శకుడిగా బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న డార్లింగ్ సినిమా ఆడియో విడుదల గురువారం రాత్రి హైటెక్ సిటీలోని సైబర్ గార్డెన్స్‌లో జరిగింది. ముందుగా చిత్రంలోని పాటలకు డాన్స్ వేస్తూ పలువురు డాన్సర్లతో కార్యక్రమాలు జరిగాయి. అల్లు అర్జున్ పుట్టినరోజు కూడా కావడంతో అక్కడే కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకులంతా కలిసి ఆడియోను విడుదల చేసి అక్కడే ఉన్న హీరోలకు అందించారు.

అల్లు అర్జున్ మాట్లాడుతూ... ఇండస్ట్రీలో ప్రభాస్‌ను డార్లింగ్ అని పిలుస్తారు. నా డార్లింగ్ కూడా. ఎంతమంచి డార్లింగ్ కాకపోతే అతని ఆడియో వేడుకలో నా పుట్టిన రోజు కేక్‌ను కట్ చేయిస్తాడు. ఈ చిత్రంలో పనిచేసిన వారందరికీ మంచి హిట్ రావాలని కోరుకుంటున్నానని చెప్పారు. రవితేజ మాట్లాడుతూ, ఈ సినిమా తప్పకుండా హిట్టయ్యే సినిమా. డార్లింగ్ పాటలతోపాటు సినిమా కూడా హిట్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.

ఈ చిత్రం సక్సెస్ కావాలని వినాయక్ కోరుకున్నారు. పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ, ప్రభాస్‌తో ఒక ప్రేమకథా చిత్రాన్ని తీయాలనుంది. కరుణాకరన్ తన స్టైల్లో ఈ చిత్రాన్ని తీశాడని అనుకుంటున్నాను. అతను "పోకిరి" చూసి ఒక్క సీన్ మాత్రమే తనకు నచ్చింది అని చెప్పాడు. అంత నిర్మహ మాటకారి. ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.

మరో దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ... కరుణాకరన్ ప్రేమకథా చిత్రాలను బాగా తీస్తాడు. ట్రైలర్స్ కూడా బాగున్నాయి. ప్రభాస్ కత్తి పట్టుకునే దృశ్యం చూసినప్పుడు అతనిలో యాక్షన్ సినిమా చేయాలనే తపన ఉన్నట్లు కనిపిస్తోంది. అలాగే కాజల్ కూడా బాగుందన్నారు.

కృష్ణంరాజు మాట్లాడుతూ... ప్రసాద్ మంచి నిర్మాత. గతంలో ఆయన ఛత్రపతి తీశాడు. ఈ సినిమా కూడా అంతటి విజయం సాధించాలని ఆకాంక్షించాడు. ప్రభాస్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నన్ను చాలా అందంగా చూపించారు. బాడీ లాంగ్వేజ్ కూడా వెరైటీగా ఉంటుందని అన్నారు. అనంతరం అభిమానులంతా ప్రభాస్‌ను గజమాలతో సత్కరించారు.

Share this Story:

Follow Webdunia telugu