Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈ దొంగ చాలా మొండోడు: పసిదాని కోసం ప్రాణాలివ్వడానికైనా..!

ఈ దొంగ చాలా మొండోడు: పసిదాని కోసం ప్రాణాలివ్వడానికైనా..!
FILE
తన బిడ్డ కాకపోయినా, ఆ పాప ఎవరో తెలీకపోయినా.. ఆ పసిదాని కోసం ప్రాణాలివ్వడానికి కూడా వెనుకాడని దొంగ కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘మొండోడు’. శ్రీకాంత్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రానికి జర్నలిస్ట్ ప్రభు దర్శకుడు. రాజరాజేశ్వరి శ్రీనివాసరెడ్డి నిర్మాత. ఈ నెలలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

భావోద్వేగపూరితమైన మాస్ కథాంశమిదని నిర్మాత చెప్పారు. ఇందులో శ్రీకాంత్ పాత్ర అన్ని వర్గాల వారికీ నచ్చేలా ఉంటుంది. సాయికార్తీక్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఈ నెల 16న విడుదల చేస్తున్నాం. ఇదే నెలలో సినిమాను విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు.

పోసాని కృష్ణమురళి, చిత్రం శ్రీను, రవివర్మ, కారుమంచి రఘు, డా.రవిప్రకాష్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వి.శ్రీనివాసరెడ్డి, ఎడిటింగ్: నాగిరెడ్డి

Share this Story:

Follow Webdunia telugu