Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అల్లు శిరీష్ : నేను ఎవరితో గొడవపడలేదు.. ఆ అమ్మాయి ఎవరో తెలియదు!

అల్లు శిరీష్ : నేను ఎవరితో గొడవపడలేదు.. ఆ అమ్మాయి ఎవరో తెలియదు!
FILE
గౌరవం సినీ హీరో అల్లు శిరీష్ వివాదంలో చిక్కుకున్నాడు. జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో ముగ్గురు యువకులు తనను వేధించారని డీజేగా పనిచేస్తున్న ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతిని వేధించిన వారిలో సినీనటుడు అల్లు శిరీష్‌ కూడా ఉన్నట్లు ప్రచారం జరిగింది.

అయితే సినీ నటుడిపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు అంటున్నారు. యువతి మాత్రం తనను వేధించిన వారిలో ఓ సినీ నటుడు కూడా ఉన్నట్లు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇక తనపై ఓ యువతి కేసు పెట్టినట్లు వచ్చిన వార్తలపై హీరో అల్లు శిరీష్ స్పందించారు.

తాను ఎవరితో గొడవపడలేదని, అసలు కేసు పెట్టిన ఆ అమ్మాయి ఎవరో తనకు తెలియదని స్పష్టం చేశారు. తనపై ఆమె ఫిర్యాదు చేయలేదని పోలీసులు చెప్పారన్నారు.

ప్రముఖ హీరో తమ్ముడని మాత్రమే ఆమె ఫిర్యాదు చేసిందన్నారు. తన పేరు అనవసరంగా లాగుతున్నారని వాపోయారు. తనకు సంభందం లేని దానిపై వివరణ ఎందుకు ఇవ్వాలని శిరీష్ ప్రశ్నించారు.

Share this Story:

Follow Webdunia telugu