Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అలాంటి పాత్రల్లో మళ్లీ నటించను: అనుష్క

అలాంటి పాత్రల్లో మళ్లీ నటించను: అనుష్క
టాలీవుడ్‌లో సెక్సీతారగా ముద్రవేసుకుని, "అరుంధతి"లాంటి సినిమాలో ఛాలెంజింగ్‌ రోల్ పోషించిన అనుష్క మళ్లీ అలాంటి చిత్రాల్లో నటించనని నొక్కి చెబుతోంది. "అరుంధతి" చిత్రం అఖండ విజయం సాధించాక మళ్లీ అదే తరహా సినిమాల్లో నటిస్తే ప్రేక్షకులను ఆకట్టుకోలేని ఆమె అంటోంది. వైవిధ్యమైన పాత్రలను పోషించాలనే ఉద్దేశంతోనే అరుంధతి చేశానని, తరచూ అలాంటి పాత్రలే చేస్తే ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తుందని నవ్వుతూ సమాధానమిచ్చింది.

కోలీవుడ్ "రెండు" సినిమాలో మాధవన్ సరసన నటించిన ఆమె, టాలీవుడ్ ఆఫర్లు వెల్లువల్లా రావడంతో ఇటువైపు మొగ్గుచూపింది. తమిళంలోనూ అరుంధతి విజయం సాధించడంతో ఆమెపై పలువురు నిర్మాతలు డేట్స్‌కోసం ఎగబడుతున్నారు. కథలో కొంచెం అటుగా ఇటుగా అరుంధతి ఛాయలుండటంతో అలాంటి స్క్రిప్ట్‌లను అనుష్క తిరస్కరించింది.

ఇటీవలే హైదరాబాద్‌లో టిక్ టిక్ టిక్ అనే ఆడియో వేడుకకు అనుష్క హాజరైంది. ఈ సందర్భంగా ఆమెను కదిలిస్తే.. ఒకే తరహా పాత్రలు పోషించడానికి తాను ఎప్పుడూ అంగీకరించనని చెప్పింది. ప్రస్తుతం కోలీవుడ్ యంగ్ హీరో విజయ్ సరసన "వేట్టైక్కారన్"లోనూ, సూర్యకు జంటకు "సింగం" లోనూ నటిస్తున్నానని వెల్లడించింది. "బిల్లా"లో బికినీ ఎక్స్‌పోజింగ్ గురించి ఆమె బదులిస్తూ.. అది అంత ఎబ్బెట్టుగా ఏమీ లేదని, అయినా దానిపై ఇప్పుడు మాట్లాడనని దాట వేసింది.

Share this Story:

Follow Webdunia telugu