Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమ్మ కూడా అదే అంది: సిద్దార్థ్‌

అమ్మ కూడా అదే అంది: సిద్దార్థ్‌
, శనివారం, 3 మార్చి 2012 (12:01 IST)
WD
సినిమాల్లో నటించడం వేరు. నటిస్తూ సినిమా ప్రొడ్యూస్‌ చేయడం వేరు. సిద్దార్థ్‌ 'లవ్‌ ఫెయిల్యూర్‌' సినిమా తీశాడు. ప్రేక్షకుల ఆదరణ బాగానే ఉంది. చాలాకాలం తర్వాత ఆనందంగా కన్పిస్తున్నారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌ వచ్చిన ఆయన మనసులోని మాటలను బయటపెట్టారు.

ఇది ఎ కంటే బి,సి సెంటర్లలో అంతగా లేదనే ప్రశ్నకు బదులిస్తూ.... ఈ సినిమా చూశాక.. మా అమ్మ కూడా కామెంట్‌ చేసింది. అందరినీ అలరిస్తుందనే నమ్మకం కలగడంలేదురా! అంది. మీరు అదే అంటున్నారు. మనం సినిమా తీసి అందరినీ మెప్పించలేం.

ఒక్కో ప్రేక్షకుడికి ఒక్కో రకంగా సినిమాలు కావాలి. కొందరికి మొదటి భాగం చాలా బాగుందిసార్‌! సెకండాఫ్‌లో ఇంకొంచెం సెంటిమెంట్‌, లేదా ఐటం సాంగ్‌ ఉంటే బాగుంటుందంటారు. ఇలా చాలామంది టేస్ట్‌కు తగినట్లు చాలా రకాలుగా మార్చాలి. అలా అయితే సినిమా తీయలేం. అందరి అభిప్రాయాలు ఒక్కటే కాదుకదా.. అంటూ బదులిచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu