Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'అత్తారింటికి దారేది' వాయిదాతో సమంత అప్సెట్... శశి పాత్రలో!

'అత్తారింటికి దారేది' వాయిదాతో సమంత అప్సెట్... శశి పాత్రలో!
, గురువారం, 8 ఆగస్టు 2013 (08:53 IST)
FILE
రాష్ట్రంలో తాజాగా నెలకొన్న పరిస్థితుల వల్ల 'అత్తారింటికి దారేది' సినిమా వాయిదా పడడం తెలిసిన విషయం తెలిసిందే. దీంతో పవన్ కల్యాణ్ అభిమానులు నిరాశ చెందారు. అంతేకాకుండా, కథానాయిక సమంతా కూడా బాగా అప్సెట్ అయ్యిందట.

ఈ విషయాన్ని తనే చెప్పింది. "ఈ సినిమా వాయిదా పడడం చాలా బాధనిపించింది. అయితే ఒకటి ... నిరీక్షణ తర్వాత లభించే ఫలితం మాత్రం మధురంగా ఉంటుంది" అంటోంది ఈ చెన్నయ్ సుందరి. ఇందులో తాను శశి అనే పాత్రలో నటించానని చెప్పింది.

ఇదిలాఉంచితే, సమంతా తాజాగా 'డాబర్ వాటికా' హెయిరాయిల్ ప్రచారచిత్రం షూటింగులో పాల్గొంది. రవి కె చంద్రన్ దీనిని షూట్ చేశారనీ, ఆయనతో పనిచేయడం ఎప్పుడూ తనకి సరదాగానే ఉంటుందనీ ఈ ముద్దుగుమ్మ చెబుతోంది. ముంబయ్‌లో జరిగిన ఈ షూట్లో పాల్గొని చెన్నయ్‌కి తిరుగు ప్రయాణం అయ్యింది. అయితే, ముంబయ్ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడం వల్ల ఫ్లయిట్ మిస్సయ్యానని ట్వీట్ చేసింది సమంత.

Share this Story:

Follow Webdunia telugu