Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అత్తారింటికి దారేది రికార్డ్స్: బాహుబలి రిలీజ్‌తో గోవిందా?!

అత్తారింటికి దారేది రికార్డ్స్: బాహుబలి రిలీజ్‌తో గోవిందా?!
, శనివారం, 1 ఫిబ్రవరి 2014 (16:35 IST)
WD
పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలీజ్ అయిన అత్తారింటికి దారేది" సినిమా రికార్డ్స్ పదిలంగా ఉన్నాయి. ఈ సినిమా రికార్డ్స్‌ను బ్రేక్ చేసేందుకు సినిమాలు భారీగా వచ్చినా... ఇకపై విడుదలయ్యే సినిమాలు సైతం పవన్ అత్తారింటికి దారేది సినిమాను ఏమీ చేయలేరని సినీ పండితులు అంటున్నారు.

ఈ సంక్రాంతికి మహేష్ బాబు వన్, రామ్‌చరణ్ ఎవడు చిత్రాలు రిలీజ్ అయినా.. ఈ రెండు సినిమాలు అత్తారింటికిదారేది రికార్డుల దరిదాపులకు కూడా చేరలేకపోయాయి. అంతేకాదు.. ఈ ఏడాది విడుదల కానున్న ఆగడు, రభస, గబ్బర్‌సింగ్ 2, లెజెండ్ వంటి చిత్రాలు కూడా పవన్ సినిమా రికార్డులను చేధించలేవని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా దాదాపు వంద కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న 'బాహుబలి' మాత్రమే పవన్ అత్తారింటికిదారేది సినిమా రికార్డ్స్‌ను బద్ధలు కొడుతుందని టాక్. మరి బాహుబలి పవన్ మూవీ రికార్డ్స్‌ను అధిగమిస్తుందా అనేది తెలుసుకోవాలంటే.. మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu