Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రేవంత్ రెడ్డి... చంద్రబాబు పెంపుడు కుక్క : ఎంపీ బాల్క సుమన్

రేవంత్ రెడ్డి... చంద్రబాబు పెంపుడు కుక్క : ఎంపీ బాల్క సుమన్
, మంగళవారం, 23 సెప్టెంబరు 2014 (11:07 IST)
తెలంగాణా ప్రాంతానికి చెందిన రేవంత్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పెంపుడు కుక్క అని తెరాస ఎంపీ బాల్క సుమన్ ఎమ్మెల్సీలు, భాను ప్రసాద్, భూపాల్ రెడ్డి జగదీశ్వర్‌లు ఆరోపించారు. ఇందే అంశంపై వారు మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేస్తున్న గొప్ప పనులు చూసి తట్టుకోలేక అసూయాద్వేషాలతో టీటీడీపీ నాయకులు విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 
 
ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వంపైనా, కేసీఆర్ పైనా చెప్పిందే చెబుతూ... అబద్ధాలను నిజం చేయాలని చూస్తున్నాడని ఆరోపించారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు పెంచుతున్న కుక్క అని ఎంపీ బాల్క సుమన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పగలు ప్రెస్ మీట్ పెట్టడం... సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి వెళ్లి జోలె పట్టడం రేవంత్‌కి అలవాటుగా మారిందన్నారు. 
 
1999లో ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేసిన రేవంత్, ప్రస్తుతం కోట్లాది రూపాయలు ఎలా సంపాదించాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం, రేవంత్ రెడ్డి కోట్లాది రూపాయలతో జూబ్లీహిల్స్‌లో ఓ భవంతిని నిర్మిస్తున్నాడని... ఆ ఇంటిని ఏ కాంట్రాక్టర్ కట్టిస్తున్నాడో... వాటికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో తనకు తెలుసని బాల్క సుమన్ ప్రకటించారు. 

Share this Story:

Follow Webdunia telugu