Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఖమ్మంలో రభస : ‘రేణుకా హటావో.. కాంగ్రెస్ బచావో’ నినాదాలు

ఖమ్మంలో రభస : ‘రేణుకా హటావో.. కాంగ్రెస్ బచావో’ నినాదాలు
, మంగళవారం, 28 ఏప్రియల్ 2015 (15:38 IST)
కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల కారణంగా ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైరా అసెంబ్లీ సీటు ఇప్పిస్తానంటూ రేణుకాచౌదరి తన భర్త నుంచి రూ.కోటి పది లక్షలు తీసుకున్నారంటూ కె.కళావతి తన అనుచరులతో కలిసి ఆందోళన నిర్వహించారు. తనకు న్యాయం చేయాలంటూ ఖమ్మంకు వచ్చిన ఏఐసీసీ కార్యదర్శి రామచంద్ర కుంతియాకు వినతిపత్రం అందజేశారు. అంతకుముందు గిరిజనులతో కలిసి కళావతి ర్యాలీ నిర్వహించారు. రేణుకా చౌదరి చీటర్‌ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
 
'సాధారణ ఎన్నికల్లో వైరా ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని నమ్మించి నా భర్త నుంచి రేణుకా చౌదరి రూ.కోటి 10 లక్షలు తీసుకున్నారు. అయినా టిక్కెట్ ఇప్పించలేదు. తిరిగి డబ్బులివ్వమంటే ఇవ్వకుండా మనోవేదనకు గురిచేయడంతో.. మనస్థాపానికి గురై నా భర్త మృతిచెందాడు' డాక్టర్ రాంజీ భార్య కళావతి ఆరోపించారు. ఇదే విషయంపై గతంలో పలు మార్లు రేణుకా చౌదరిని సంప్రదించిన ఎలాంటి ఫలితం రాలేదన్నారు. 
 
కాగా, మంగళవారం ఖమ్మం జిల్లాలో జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కుంతియ ముఖ్య అతిథిగా వస్తున్నారని తెలుసుకున్న రాంజీ భార్య, బంధువులతోపాటు గిరిజన నాయకులు పార్టీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ‘రేణుకా హటావో కాంగ్రెస్ బచావో' అనే ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. కాగా, పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu