Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విభజన తర్వాత హైదరాబాద్ ఆదాయం తగ్గిపోయింది : టి సర్కారు

విభజన తర్వాత హైదరాబాద్ ఆదాయం తగ్గిపోయింది : టి సర్కారు
, సోమవారం, 22 సెప్టెంబరు 2014 (14:19 IST)
రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు 14వ ఆర్థిక సంఘానికి ఇచ్చిన నివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. విభజనకు ముందు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించిన చాలా వాణిజ్య సంస్థలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు తరలి వెళుతున్నాయని పేర్కొంది. విభజన తర్వాత వాణిజ్య రంగానికి చెందిన దాదాపు మూడు వేల మంది డీలర్లు తమ కార్యాలయాలను ఆంధ్రప్రదేశ్‌కు మార్చుకున్నాయని తెలిపారు. 
 
అంతేకాకుండా, విభజన తర్వాత హైదరాబాద్‌కు రాకపోకలు క్రమంగా తగ్గిపోతున్నాయనీ, దీని ప్రభావం పెట్రోలియం ఉత్పత్తుల మీద, ఇతర అమ్మకాల మీద పడిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన నివేదికలో ఆర్థిక సంఘానికి వివరించింది. ఈ రెండు కారణాల వల్ల, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వ్యాట్ పన్నులతో పాటు స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, వాహన పన్నుల రూపంలో వచ్చే ఆదాయం కూడా భారీగా తగ్గిందని ఆర్థిక సంఘానికి ఇచ్చిన నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. హైదరాబాద్‌కు భారీ ఆదాయం వస్తోందన్న ప్రచారం వాస్తవ దూరమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన నివేదికలో పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu