Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బతుకమ్మ పండగకు సోనియాను ఆహ్వానించాలి: టీ కాంగ్రెస్

బతుకమ్మ పండగకు సోనియాను ఆహ్వానించాలి: టీ కాంగ్రెస్
, సోమవారం, 15 సెప్టెంబరు 2014 (10:21 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహించతలపెట్టిన బతుకమ్మ ఉత్సవాలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని విధిగా ఆహ్వానించాల్సిదేనంటూ తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీనే కాబట్టి బతుకమ్మ వేడుకలకు ఆమెను ఆహ్వానించాల్సిందేనని వారు మొత్తుకుంటున్నారు. 
 
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని ఫణంగా పెట్టి... సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని వారు గుర్తు చేస్తున్నారు. అందువల్ల తెలంగాణ ప్రజలు ఎప్పటికీ కృతజ్ఞులై ఉండాలని మాజీ మంత్రి డీకే అరుణం అంటున్నారు. బతుకమ్మ ఉత్సవాలకు కేంద్ర మంత్రులను, విదేశీయులను ఆహ్వానిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... తెలంగాణ ఇచ్చిన సోనియాను మాత్రం ఎందుకు ఆహ్వానించడం లేదో తమకు అర్థం కావడం లేదన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu