Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

16 యేళ్ల యువకుడి నుంచి 60 యేళ్ళ వృద్ధుడి వరకు అదే యావ... అదే గోల...

16 యేళ్ల యువకుడి నుంచి 60 యేళ్ళ వృద్ధుడి వరకు అదే యావ... అదే గోల...
, గురువారం, 29 అక్టోబరు 2015 (15:35 IST)
ఒక్క హైదరాబాద్ నగరంలోనే కాదు.. ప్రతిచోటా మహిళల దాడులు, అఘాయిత్యాలు, వేధింపులు, వెకిలి చేష్టలులకు గురవూతునే ఉన్నారు. ఈ తరహా చర్యలకు పాల్పడే పోకిరీల్లో 16 యేళ్ళ యువకుడి నుంచి 60 యేళ్ల వృద్ధుడి వరకు ఉన్నారు. ఇలాంటివారి ఆట కట్టించి, యువతులకు, మహిళలకు రక్షణ కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 'షీ టీమ్స్‌'ను ఏర్పాటు చేశాయి. ఈ టీమ్స్ ఏర్పాటై ఇటీవలే ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నాయి. ఈ సందర్భంగా గత యేడాదికాలంలో తమ ప్రగతిని మీడియాకు షీ టీమ్స్ ప్రతినిధులు మీడియాకు వెల్లడించారు.
 
హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధుల్లో పోకిరీల ఆటలు గణనీయంగా తగ్గాయి. దీనికి కారణం షీ టీమ్స్. మఫ్టీలో బస్టాండులు, రైల్వే స్టేషన్లు, కాలేజీల వద్ద వేచివుండే ఈ టీమ్స‌కు చెందిన సభ్యులు అకతాయిలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని ఆటకట్టిస్తున్నాయి. ఇలా గత యేడాది కాలంలో 874 మందిని అరెస్టు చేశాయి. వీరిలో 244 మంది మైనర్లు కావడం గమనార్హం. వీరంతా 9, 10 తరగతి చదివే పిల్లలు కావడం గమనార్హం. ఇలాంటి వారికి వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి పంపిస్తున్నారు. రెండోసారి పట్టుబడితే మాత్రం వారిపై కేసులు పెట్టి కటకటాల వెనక్కి పంపిస్తున్నారు. అలాగే, మరో 20 మందిపై నిర్భయ చట్టం కింద కేసులు పెట్టింది. అయినప్పటికీ.. పలు ప్రాంతాల్లో ఈ పోకిరీల ఆగడాలు శృతిమించిపోతూనే ఉన్నాయని ఆ బృందం ప్రతినిధులు చెపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu