Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జడ్జిపైకి కోడి గుడ్డు... కోర్టు హాలుపై దాడి.. టి. లాయర్లు రచ్చ

జడ్జిపైకి కోడి గుడ్డు... కోర్టు హాలుపై దాడి.. టి. లాయర్లు రచ్చ
, శనివారం, 28 ఫిబ్రవరి 2015 (07:11 IST)
ప్రత్యేక కోర్టు చేపట్టాలంటూ రంగారెడ్డి జిల్లా కోర్టు వద్ద లాయర్లు రచ్చ రచ్చ చేశారు. కోర్టు ద్వారాలను మూసేసి.. లోనికి ఎవరిని పోనివ్వకుండా అడ్డుకున్నారు. తెలంగాణకు ప్రత్యేక కోర్టును కేటాయించాలంటూ ఆందోళనకు దిగారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓ జడ్జిపై కోడి గుడ్డు విసరబోయారు. పోలీసుల రంగ ప్రవేశంతో ఆందోళన అదుపులోకి వచ్చింది. 
 
తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని తెలంగాణ న్యాయవాదులు గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్న విషయం తెల్సిందే. ఈ ఆందోళన ఆంధ్ర ప్రాంతానికి చెందిన న్యాయమూర్తి మీద కోడిగుడ్లతో దాడి చేసేంత వరకూ వచ్చింది. 
 
ఈ ఆందోళనలో భాగంగా మెయిన్ గేటు మూసివేసిన లాయర్లు న్యాయమూర్తులు సహా ఏ ఒక్కరూ లోపలికి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. లాయర్ల ఆందోళనపై సమాచారం అందుకున్న పోలీసులు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను రంగంలోకి దించారు. అయినా వెనక్కు తగ్గని లాయర్లు ఆందోళన కొనసాగించారు. ఎట్టకేలకు పోలీసులు న్యాయవాదులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ సందర్భంగా పోలీసులు, న్యాయవాదుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.
 
ఆంధ్రా జడ్జి పైకి తెలంగాణ లాయర్లు కోడిగుడ్లు విసిరారు. అయితే, న్యాయమూర్తులకు గుడ్లు తగలలేదు. జడ్జిల వాహనాల పైకి కూడా గుడ్లు విసిరే ప్రయత్నం చేశారు. అవి పక్కనున్న వ్యక్తుల పైన పడ్డాయి.
 

Share this Story:

Follow Webdunia telugu