Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేసీఆర్ కేబినెట్‌లో ఒక్క మగాడు కూడా లేడు.. ఒకవేళ ఉంటేగింటే..!?

కేసీఆర్ కేబినెట్‌లో ఒక్క మగాడు కూడా లేడు.. ఒకవేళ ఉంటేగింటే..!?
, శుక్రవారం, 17 ఏప్రియల్ 2015 (09:58 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్ కేబినెట్‌లో ఒక్క ‘మగాడు’ కూడా లేడని తెలంగాణ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశంలో పాలుపంచుకున్న సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ నేతల్లో ఉత్సాహం నింపారు. టీఆర్ఎస్ నేతలపై విమర్శనాస్త్రాలు సంధించారు. 
 
కేసీఆర్ కేబినెట్‌లో ఒక్కమగాడు కూడా లేడని.. ఒకవేళ ఆ తరహా ‘మగాడు’ ఉంటేగింటే... సదరు నేత టీడీపీ నుంచి వలస వెళ్లినవారే అయి ఉంటారని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ఎప్పుడు పూర్తువుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నా, కేసీఆర్ ఫాం హౌస్‌లో మాత్రం ఎత్తిపోతల పథకాలు త్వరితగతిన పూర్తవుతున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Share this Story:

Follow Webdunia telugu