Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆరుగురు అమ్మాయిలు.. 17 మంది మగాళ్లు... కిక్కు తలకెక్కి బుక్కయ్యారు.. ఎక్కడ?

ఆరుగురు అమ్మాయిలు.. 17 మంది మగాళ్లు... కిక్కు తలకెక్కి బుక్కయ్యారు.. ఎక్కడ?
, ఆదివారం, 7 ఫిబ్రవరి 2016 (10:59 IST)
హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే.. కాస్తంత ఉపశమనం పొందాలని భావించారు కొందరు జీహెచ్ఎంసీ అధికారులు.. సిబ్బంది. ఈ ఆలోచన వచ్చిందే తడవుగా శనివారం వీకెండ్ పార్టీ కోసం భారీ ఏర్పాట్లు చేసుకున్నారు. ఆరుగురు అమ్మాయిలతో అర్థనగ్న నృత్యాలు చేస్తూ.. తాగిన మద్యం కిక్కు తలకెక్కడంతో గొవడపడ్డారు. ఈ గొడవ విన్న స్థానికులు.. తిన్నగా పోలీసులకు సమాచారం అందించారు. అంతే.. జీహెచ్ఎంసీ ఉద్యోగులు అడ్డంగా బుక్కయ్యారు. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
హైదరాబాద్, ఖానామెట్‌ ఫాతిమా గెస్ట్‌హౌస్‌లో శనివారం రాత్రి కూకట్‌పల్లి, శేర్లింగంపల్లి జీహెచ్‌ఎంసీ బిల్‌ కలెక్టర్లు, ఉద్యోగులు పార్టీ జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. నగరం నుంచి ఆరుగురు అందమైన యువతులను రప్పించారు. అందరూ కలసి.. మద్యం మత్తులో మునిగారు. తలకెక్కిన మత్తుతో విచక్షణ మరిచారు. హోరెత్తించే డీజేతో అర్థనగ్న నృత్యాలు చేస్తూ గొడవ పడ్డారు. 
 
దీంతో స్థానికులు మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తనిఖీ చేసి అక్కడ పరిస్థితికి విస్మయానికి గురయ్యారు. ఆరుగురు యువతులు, 17 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై వివిధ సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu