Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్మితా సబర్వాల్‌కు రూ.15లక్షలు ఎలా మంజూరు చేస్తారు?

స్మితా సబర్వాల్‌కు రూ.15లక్షలు ఎలా మంజూరు చేస్తారు?
, గురువారం, 3 సెప్టెంబరు 2015 (10:23 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు కోర్టు ఖర్చుల నిమిత్తం రూ. 15లక్షలు మంజూరు చేయడాన్ని రచయిత, సామాజిక కార్యకర్తల వత్సల విద్యాసాగర్ హైకోర్టులో సవాల్ చేశారు. ఓ ప్రైవేట్ కార్యక్రమం గురించి ఆంగ్ల దినపత్రిక ఒకటి కథనం రాస్తే, దానిపై పోరాడేందుకు స్మితా సబర్వాల్‌కు న్యాయ సాయం చేయడం సబబు కాదని విద్యా సాగర్ చెప్పారు. 
 
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, స్మితా సబర్వాల్‌లను ప్రతివాదులుగా పేర్కొంటూ, ఆమె వ్యక్తిగత వ్యవహారంలో ప్రజాధనాన్ని మంజూరు చేయడాన్ని విద్యాసాగర్ ప్రశ్నించారు. ఇలా నిధులివ్వడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు దృష్టికి తెచ్చారు. కాగా, ఇటీవల 'అవుట్ లుక్' పత్రిక, స్మిత గురించి ఓ అభ్యంతరకర కార్టూన్, కథనాన్ని ప్రచురించగా, ఆ పత్రికపై స్మిత రూ. 10 కోట్లకు పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే.
 
స్మితా సబర్వాల్ ఓ హోటల్‌లో పాల్గొన్న ప్రైవేట్ కార్యక్రమం గురించి ఔట్‌లుక్ పత్రిక కథనం, కార్జూన్ ప్రచురించిందని, ఇది ఆమె వ్యక్తిగతమని వ్యవహారమని వత్సల అన్నారు. న్యాయ వివాదంలో గెలిస్తే మంజూరు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని చెప్పిన ప్రభుత్వం, ఓడిపోతే వదులుకుంటున్నట్లు పరోక్షంగా తన ఉత్తర్వుల్లో చెప్పందని విద్యాసాగర్ చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu