Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వరి రెడ్డి ఓటమి తప్పదా?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వరి రెడ్డి ఓటమి తప్పదా?
, గురువారం, 26 మార్చి 2015 (12:04 IST)
తెలంగాణ రాష్ట్రంలో రెండు పట్టభద్రుల స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగగా, బుధవారం ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అయితే, ఈ ఎన్నికల్లో  హైదరాబాద్, రంగారెడ్డి మరియు మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజక వర్గం ఓట్ల లెక్కింపులో తెరాస అభ్యర్థి దేవీ ప్రసాద్ బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు చేతిలో చిత్తుగా ఓడిపోయారు. ఇపుడు మరో అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డి పరిస్థితి కూడా అయోమయంగా ఉంది. 
 
తెలంగాణ శాసనమండలి ఎన్నికలకు సంబంధించి వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల స్థానం కౌంటింగ్‌లో ప్రస్తుతానికి 14 రౌండ్లు పూర్తయ్యాయి. ప్రతి రౌండ్‌కు స్వల్ప ఆధిక్యం కనబరుస్తూ వస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి 14వ రౌండ్ ముగిసేసరికి 11,133 ఓట్ల ఆధిక్యాన్ని మాత్రమే సాధించారు. అయితే తొలి ప్రాధాన్యత ఓట్లలోనే ఆయన గెలుపు ఖాయమయ్యేలా లేదు. దీంతో ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కూడా అనివార్యమయ్యే అవకాశాలున్నాయి. 
 
నిజానికి ఈ ఎన్నికల్లో గెలుపు కోసం పల్లా రాజేశ్వర్ రెడ్డికి 75 వేల ఓట్లు రావాలి. అయితే ఆయన ఆ మార్కుకు చాలా దూరంలో ఉన్నారు. దీంతో ఈ ఎన్నికలో అభ్యర్థి విజయాన్ని ఖరారు చేసేందుకు ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను కూడా లెక్కించాల్సి ఉందని కౌంటింగ్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే కౌంటింగ్ ప్రారంభమై 26 గంటలకు పైగా సమయం గడిచింది. ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కూడా పూర్తి కావాలంటే మరితం సమయం పట్టే అవకాశాలున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu