Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అక్టోబర్ నుంచి కొత్త మద్యం పాలసీ అమలు: కేసీఆర్ ప్రకటన

అక్టోబర్ నుంచి కొత్త మద్యం పాలసీ అమలు: కేసీఆర్ ప్రకటన
, శుక్రవారం, 31 జులై 2015 (14:50 IST)
అక్టోబర్ నుంచి కొత్త మద్యం పాలసీని అమలు చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ఈ మద్యం విధానాన్ని తీసుకొస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. గుడుంబా మహమ్మారితో ఎన్నో కుటుంబాలు అనాథలు అవుతున్నాయన్నారు.

ప్రాణాలకు హాని కలిగించని మద్యాన్ని తయారు చేయాలని కేసీఆర్ చెప్పారు. హైదరాబాదులో ఎన్నో ప్రాంతాల ప్రజలు ఉన్నారని... అందువల్ల అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని నూతన మద్యం పాలసీని తెస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.
 
ఇదిలా ఉంటే.. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఎంపీలు తమ ఆందోళనను తీవ్రతరం చేశారు. ఈ మేరకు శుక్రవారం నాటి పార్లమెంటు సమావేశాల్లో నినాదాలు చేశారు. అనంతరం, లోక్ సభలో ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ సీటు ముందుకు వెళ్లి నిలబడి మౌనంగా తమ నిరసన వ్యక్తం చేశారు.

గత పార్లమెంటు సమావేశాల్లో కూడా టీఆర్ఎస్ ప్రత్యేక హైకోర్టు కోసం ఆందోళన చేసింది. ప్రత్యేక హైకోర్టు లేకపోతే తెలంగాణకు న్యాయం జరగదని టీఆర్ఎస్ ఎంపీలు ఆరోపించారు.

Share this Story:

Follow Webdunia telugu