Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేటీఆర్ అన్నయ్యా... హైదరాబాద్ అభివృద్ధి చేసింది నీ తాతా...? లోకేష్ ప్రశ్న

కేటీఆర్ అన్నయ్యా... హైదరాబాద్ అభివృద్ధి చేసింది నీ తాతా...? లోకేష్ ప్రశ్న
, గురువారం, 28 జనవరి 2016 (19:23 IST)
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు హామీలతో పాటు టపాసుల్లాంటి మాటలు కూడా పేల్చుకుంటున్నారు నాయకులు. హైదరాబాద్ అభివృద్ధి ఎక్కడ... ఎవరు చేశారంటూ మంత్రి కేటీఆర్ చేసిన విమర్శపై నారా లోకేష్ స్పందించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా లోకేష్ మాట్లాడుతూ... హైదరాబాదును ఈ స్థాయికి తీసుకొచ్చింది కేటీఆర్ తాతా? తండ్రా? అంటూ ప్రశ్నాస్త్రం సంధించారు. 
 
19 నెలలు పూర్తి చేసుకుని అధికారం వెలగబెడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాదు అభివృద్ధికి తీసుకున్న చర్యలేమిటో, చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరాన్ని తన తాతయ్య ఎన్టీఆర్ ఉన్నతంగా తీర్చిదిద్దారని చెప్పుకొచ్చారు. ఆ నగరాన్ని తన తండ్రి చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చారని అన్నారు. టీఆర్ఎస్ నేతలకు వాస్తవాలు కనబడటం లేదనీ, ఐతే హైదరాబాద్ అభివృద్ధి ఎవరివల్ల జరిగిందో ప్రజలకు తెలుసన్నారు. గ్రేటర్ హైదరాబాదులో తమ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu