Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెరాస అధినేతగా కేసీఆర్ ఏకగ్రీవం.. 6 నామినేషన్లు.. అన్నీ ఆయనకే!

తెరాస అధినేతగా కేసీఆర్ ఏకగ్రీవం.. 6 నామినేషన్లు.. అన్నీ ఆయనకే!
, సోమవారం, 20 ఏప్రియల్ 2015 (18:44 IST)
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేతగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరోమారు ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు. ఆయన తరపున మొత్తం ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నామినేషన్లు మినహా ఇతరులెవ్వరూ కూడా దాఖలు చేయలేదు. దీంతో కేసీఆర్ పార్టీ అధినేతగా మరోమారు ఏకగ్రీవంగా ఖావడం ఖరారైపోయింది.
 
ఇదే అంశంపై ఆ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి మాట్లాడుతూ... కేసీఆర్‌ తరపున టీఆర్‌ఎస్‌ అధ్యక్ష పదవికి ఆరు నామినేషన్లు దాఖలైనట్టు తెలిపారు. కేసీఆర్‌ను ప్రతిపాదిస్తూ ఇప్పటి వరకు 6 నామినేషన్లు దాఖలయ్యాయని తెలిపారు. పార్టీ అధ్యక్ష పదవికి కెసిఆర్ మినహా ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం కడియం కెసిఆర్‌ను అధ్యక్షుడిగా ప్రతిపాదించారని తెలిపారు. కడియం శ్రీహరి ప్రతిపాదనను ఆరుగురు మంత్రులు బలపరిచారని పేర్కొన్నారు. 24వ తేదీన అధ్యక్ష ఎన్నిక ప్రకటన ఉంటుందని హోంమంత్రి తెలిపారు.
 
అలాగే, గ్రేటర్ టిఆర్‌ఎస్ అధ్యక్షుడిగా మైనంపల్లి టిఆర్‌ఎస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా మైనంపల్లి హనుమంతరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు సోమవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన టిఆర్‌ఎస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో ఆయనను టిఆర్‌ఎస్ గ్రేటర్ హైదరాబాద్ విభాగం అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. మైనంపల్లి పేరును డిప్యూటీ సిఎం మహమూద్ ఆలీ ప్రతిపాదించారు. మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, పద్మారావు బలపర్చారు. మంత్రి మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. 

Share this Story:

Follow Webdunia telugu