Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లగడపాటి ఎలా ఉన్నారు.. పద్మను ప్రశ్నించిన కేటీఆర్!

లగడపాటి ఎలా ఉన్నారు.. పద్మను ప్రశ్నించిన కేటీఆర్!
, గురువారం, 24 జులై 2014 (08:55 IST)
హైదరాబాద్‌లో నిర్వహించిన మహిళా పారిశ్రామికవేత్తల సమావేశంలో ఓ విచిత్ర సంగటన చోటు చేసుకుంది. ఈ సదస్సులో తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవగా... లగడపాటి రాజగోపాల్ సతీమణి పద్మ కూడా వచ్చారు. ఈ సమావేశంలో వీరు ఇరువురూ కొద్దిసేపు మాట్లాడుకోవడంతో పాటు... పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకున్నారు. ఈ సందర్భంగా లగడపాటి రాజగోపాల్ ఎలా ఉన్నారని కేటీఆర్... పద్మను అడగగా... బాగానే ఉన్నారని పద్మ బదులిచ్చారు. రాజకీయాలు వదిలివేసిన తర్వాత రాజగోపాల్ ఆనందంగా ఉన్నట్టున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించగా... రాజకీయాలు వదిలివేసిన తర్వాత రాజగోపాల్ చాలా హ్యాపీగా, ప్రశాంతంగా ఉన్నారని పద్మ బదులిచ్చారు.
 
ఈ సందర్భంగా పద్మ కూడా కేటీఆర్‌ను పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగారు. ఆంధ్రా నుంచి వచ్చే ప్రైవేటు బస్సులను తిరగనివ్వబోమని తెలంగాణ రవాణా మంత్రి మహేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పద్మ కేటీఆర్ వద్ద ప్రస్తావించారు. దీనికి కేటీఆర్, ఆంధ్రా నుంచి వచ్చే ప్రైవేటు బస్సులను అడ్డుకునే సమస్యే లేదని.... కేవలం ఒక పర్మిట్‌తో పది బస్సులను నడుపుతున్న బస్సులను మాత్రమే అడ్డుకుంటామని స్పష్టం చేశారు. మొత్తానికి వీరివురి సంభాషణ ఈ సదస్సుకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
 
కాగా, రాష్ట్ర విభజనంటూ జరిగితే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజోపాల్ ప్రకటించారు. ఆ ప్రకారంగానే విభజన అనంతరం ఆయన పాలిటిక్స్‌కు దూరయ్యారు. ఆ తర్వాత ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని కేటీఆర్ ఫోన్ చేసి మరీ లగడపాటి రాజగోపాల్‌ను కోరినా ప్రయోజనం లేకుండా పోయింది. 

Share this Story:

Follow Webdunia telugu