Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైదరాబాద్ లో గ్యాంగ్ రేప్... లవర్స్ ను బంధించి యువతిపై జిమ్ కోచ్, రియల్టర్లు

హైదరాబాద్ లో గ్యాంగ్ రేప్... లవర్స్ ను బంధించి యువతిపై జిమ్ కోచ్, రియల్టర్లు
, శుక్రవారం, 22 ఆగస్టు 2014 (22:57 IST)
మనుషుల్లో నానాటికీ పశుప్రవృత్తి పెరిగిపోతోందడనాకి మరో నిదర్శనమిది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జరిగిన దారుణ ఘటన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాదులోని పహాడీ షరీఫ్ లో జిమ్ కోచ్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు తాము మనుషులమనే విచక్షణ మరచిపోయారు. అడవి జంతువుల్లా ప్రవర్తించారు. తమ కంటబడిన ఓ ప్రేమ జంటను ఫాం హౌస్ లో బంధించి, యువతిపై 9 మంది కామాంధులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. 
 
అంతటితో ఆగకుండా ఆమె నగ్నత్వాన్ని ఫోటోలు తీసి ఫేస్ బుక్ లో పెట్టేశారు. అంతటితో వదలక ప్రేమికులను బంధించిన గదిలోకి పాములను విడిచిపెట్టి పైశాచిక ఆనందాన్ని పొందారు. ఈ నరరూప రాక్షసుల నుంచి బాధితులు ఎలాగో తప్పించుకుని పహడీషరీఫ్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు జిమ్ కోచ్ తో సహా ఎస్టేట్ వ్యాపారి ఖాదర్, తయ్యబ్ తో పాటు మరో ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

Share this Story:

Follow Webdunia telugu