Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మెదక్ ఉప ఎన్నికల్లో పోటీ ఆ రెండు స్థానాల కోసమే : హరీష్ రావు

మెదక్ ఉప ఎన్నికల్లో పోటీ ఆ రెండు స్థానాల కోసమే : హరీష్ రావు
, గురువారం, 28 ఆగస్టు 2014 (11:03 IST)
మెదక్ లోక్‌సభకు జరుగనున్న ఉప ఎన్నికల్లో గెలుపు టీఆర్ఎస్‌దేనని తెలంగాణ రాష్ట్ర మంత్రి  హరీష్ రావు జోస్యం చెప్పారు. ఇపుడు పోటీ అంతా రెండు, మూడు స్థానాల కోసమే ఈ ఎన్నికల పోలింగ్ నిర్వహించాల్సి ఉందన్నారు. 
 
మెదక్ ఉప ఎన్నికలపై ఆయన మాట్లాడుతూ.. మెదక్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌దే విజయమన్నారు. ఇప్పుడు తెలియాల్సింది ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించే పార్టీలు ఏవనేవేనని అన్నారు. 
 
ఉద్యమాల ఖిల్లా మెదక్ జిల్లా అని, ఉద్యమకారులపై కేసులు పెట్టించిన వ్యక్తినే ఓ పార్టీ బరిలో దించిందని ఆక్షేపించారు. మేనిఫెస్టోలో చెప్పిన విషయాలనే తాము ఆచరిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఆటో డ్రైవర్లు, ట్రాక్టర్లపై పన్నులు రద్దు చేసిన ప్రభుత్వం తమదని ఆయన తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu