Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డాక్టర్ శశికుమార్ సుసైడ్... చంద్రకళ ఎవరో డాక్టర్ భార్యకు తెలియదా...? ట్విస్టులేనా...?

డాక్టర్ శశికుమార్ సుసైడ్... చంద్రకళ ఎవరో డాక్టర్ భార్యకు తెలియదా...? ట్విస్టులేనా...?
, బుధవారం, 10 ఫిబ్రవరి 2016 (15:46 IST)
డాక్టర్ శశికుమార్ తన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకునే ముందు ఓ సూసైడ్ నోట్ రాసి పెట్టి ఆ పనికి పూనుకున్నాడు. ఐతే తన తుపాకీతో మరో డాక్టర్ ఉదయ్ పైన సాయికుమార్ అనే డాక్టర్ కాల్పులకు పాల్పడ్డాడంటూ రాశాడు. మరలాంటప్పుడు ఈ విషయాన్ని తిన్నగా పోలీసులకు చెప్పకుండా పారిపోవడం ఏమిటి అనేది ప్రశ్న. కాగా పోలీసులు మాత్రం ఉదయ్ పైన కాల్పులు జరిపింది డాక్టర్ శశి కుమారే అని నిర్థారణకు వచ్చారు.
 
ఇదిలావుంటే శశికుమార్ తన స్నేహితురాలు అంటూ చెప్తున్న చంద్రకళకే ఎందుకు ఫోన్ చేశారు. ఆమె ఫ్యామిలీ ఫ్రెండ్ అయితే శశికుమార్ భార్యకు చంద్రకళ ఎవరో తెలియదా... శశికుమార్ భార్య చెప్తున్నదాన్ని బట్టి చూస్తే చంద్రకళ ఎవరో తనకు తెలియదంటున్నారు. ఆ ఫార్మ్ హౌస్ కుడా ఎవరిదో తెలియదని చెపుతున్నారు. దీన్నిబట్టి చంద్రకళ డాక్టర్ శశి కుమార్ భార్యకు పరిచయం లేదని అర్థమవుతుంది. ఐతే డాక్టర్ శశి కుమార్ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించినప్పుడు అక్కడే ఉన్న కాపలా వ్యక్తిని ఎందుకు అప్రమత్త చేయలేదనే ప్రశ్న ఉదయిస్తుంది. 
 
ఇంకా డాక్టర్ తన మనసు బాగోలేదంటే మందు బాటిళ్లతో సహా సప్లై చేయించి డాక్టర్ గారిని జాగ్రత్తగా చూసుకోమని చంద్రకళ చెప్పినట్లు తెలుస్తోంది. అలా చెప్పి ఇంటికి వచ్చాక టీవీలో చూసిన వార్తలను షాక్ తిన్న చంద్రకళ, శశికుమార్ తనతో ఫోనులో చెప్పినదంతా పూసగుచ్చినట్లు చెప్పారు. ఐతే శశి కుమార్ భార్య వాదన మరోలా ఉంది. అంతా కలిసి తన భర్తను చంపేశారని అంటున్నారు. మరి ఇందులో వాస్తవాలేమిటో తెలిసేందుకు మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu