Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టి మంత్రి కేటీఆర్ దగ్గర ఆంధ్రా వాసనలు : డీకే అరుణ

టి మంత్రి కేటీఆర్ దగ్గర ఆంధ్రా వాసనలు : డీకే అరుణ
, గురువారం, 30 అక్టోబరు 2014 (12:59 IST)
తెలంగాణ మంత్రి కేటీఆర్ వద్ద ఆంధ్రా సువాసనలు వస్తున్నాయని మాజీ మంత్రి, కాంగ్రెస్ మహిళా నేత డీకే అరుణ అన్నారు. ఎందుకంటే కేటీఆర్ ఎన్టీఆర్ పేరు పెట్టుకుని, ఆంధ్రాలో చదువుకున్నారని గుర్తు చేశారు. 
 
తాను తెలంగాణలో పుట్టి, పెరిగానని చెప్పారు. అందువల్ల తనకు ఆంధ్రా వాసనలు వచ్చే అవకాశం లేదన్నారు. కానీ, కేటీఆర్ ఆంధ్రాలో విద్యాభ్యాసం పూర్తి చేయడమే కాకుండా, ఇప్పటికీ ఆంధ్రా నేతలతో కలిసి వ్యాపారం చేస్తున్నారన్నారు. కానీ కేసీఆర్‌కు, కేటీఆర్‌కు ఆంధ్రోళ్లను తిట్టనిదే నిద్రపట్టదని ఆమె విమర్శించారు. 
 
ఇకపోతే.. రైతు ఆత్మహత్యలపై ఆమె స్పందిస్తూ.. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గంలోనే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా టీఆర్ఎస్ సర్కారు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా రైతు ఆత్మహత్యలను అవమానించేవిధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలపై మంత్రులు ఎదురుదాడి చేయడం మానుకోవాలని హితవు పలికారు. వ్యవసాయానికి విద్యుత్ ఇచ్చి.. రైతు ఆత్మహత్యలు నివారించాలని కోరారు. 

Share this Story:

Follow Webdunia telugu