Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పూరి జగన్నాథ్ చెంచ ఛెళ్లుమనిపిస్తా : దేశపతి శ్రీనివాస్ వ్యాఖ్యలు

పూరి జగన్నాథ్ చెంచ ఛెళ్లుమనిపిస్తా : దేశపతి శ్రీనివాస్ వ్యాఖ్యలు
, శనివారం, 24 జనవరి 2015 (14:41 IST)
సమాజాన్ని చెడగొట్టే సినిమాలు తీసే దర్శకుడు పూరి జగన్నాథ్ చెంప పగులగొడుతానని తెలంగాణ ముఖ్యమంత్రి వద్ద ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా విధులు నిర్వహిస్తున్న ప్రముఖ తెలంగాణ గాయకుడు దేశపతి శ్రీనివాస్ ఘాటు, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలో ఒక కళాశాలలో శుక్రవారం జరిగిన ఒక సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. 
 
సమాజాన్ని ఉద్ధరించడానికి సినిమాలు తీస్తే చంకనాకిపోతామంటూ పూరి జగన్నాథ్ ఈమధ్య అన్నారని, అలాంటి మాటలు మాట్లాడినందుకు పూరి జగన్నాథ్ చెంపను ఛెళ్ళుమనిపించాలని తనకు ఉందని ఆయన అన్నారు. సీమాంధ్రకు చెందిన కొందరు దర్శకులు స్త్రీలను, ఉపాధ్యాయులను, తండ్రులను అవమానిస్తూ బలాదూర్ కల్చర్‌ని తెస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu