Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాంగ్రెస్ నాకేం చేయలేదు.. కేసీఆర్ నా టాలెంట్‌ను గుర్తించారు : డీఎస్

కాంగ్రెస్ నాకేం చేయలేదు.. కేసీఆర్ నా టాలెంట్‌ను గుర్తించారు : డీఎస్
, శుక్రవారం, 28 ఆగస్టు 2015 (15:13 IST)
నిన్నమొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ధర్మపురి శ్రీనివాస్ హస్తినలో బాగానే చక్రం తిప్పారు. ఇపుడే అదే కాంగ్రెస్ పార్టీపై డీఎస్ విమర్శలు ఎక్కుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ నాకంటూ ఏమి చేయలేదన్నారు. కానీ, తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన మరుక్షణమే ఆ పార్టీ అధినేత కేసీఆర్ తన టాలెంట్‌ను గుర్తించి.. ప్రభుత్వ సలహాదారుగా నియమించారని చెప్పారు.
 
పైగా, బంగారు తెలంగాణ సాధించేవరకు కేసీఆర్ రిటైర్ కారని... గొప్ప విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. అలాగే, తనకున్న సంబంధాలతో అంతర్రాష్ట్ర సంబంధాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని ప్రకటించారు. సీఎం కేసీఆర్ కోరుకున్న విధంగా న్యాయబద్దంగా సమస్యలను పరిష్కరిస్తాననే నమ్మకం తనకు ఉందన్నారు. కర్ణాటక, మహారాష్ట్రతో ఇరిగేషన్ సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. తానొక విజనరీ అని చెప్పుకునే ఏపీ సీఎం చంద్రబాబు సమస్యల పరిష్కారానికి ఎందుకు ముందుకు రావడంలేదని ప్రశ్నించారు. చంద్రబాబు తీరేంటో తనకు అర్థం కావడంలేదన్నారు. 
 
పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న వాళ్లం సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో తమకు తెలియదా? అని అన్నారు. సదుద్దేశంతో ముందుకు పోతే సమస్యలు అవే పరిష్కారమవుతాయన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అందరం కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. తెలంగాణ దేశంలో అగ్రగామి రాష్ట్రంగా ఎదిగేందుకు కృషి చేయాలన్నారు. ఏ రకమైనా బంగారు తెలంగాణను చూడాలనుకున్నామో తప్పకుండా అలాంటి బంగారు తెలంగాణను చూస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా పదవీబాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu