Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రేవంత్‌కు బెయిల్.. కేసీఆర్‌కు ఫీవర్.. 'ఆట మొదలైంది' అంటున్న రేవంత్ గణం!

రేవంత్‌కు బెయిల్.. కేసీఆర్‌కు ఫీవర్.. 'ఆట మొదలైంది' అంటున్న రేవంత్ గణం!
, బుధవారం, 1 జులై 2015 (10:17 IST)
ఓటుకు నోటు కేసులో టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. అదేసమయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫీవర్ వచ్చింది. రేవంత్ రెడ్డికి బెయిల్ రావడం వల్లే కేసీఆర్‌కు ఫీవర్ వచ్చిందంటూ టీడీపీ శ్రేణులు సెటైర్లు వస్తూ.. తెలంగాణ రాష్ట్రంలో ఇక ఆటమొదలైందనే కామెట్లతోపాటు.. ఫ్లెక్సీలు కూడా వెలిశాయి. 
 
మరోవైపు.. చర్లపల్లి జైలు నుంచి రేవంత్ రెడ్డి విడుదలయ్యేందుకు బుధవారం సాయంత్రం వరకు వేచివుండాల్సిందే. బెయిల్ పత్రాల టైపింగ్‌లో దొర్లిన చిన్న పొరపాటు కారణంగా ఆయన జైల్లోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, రేవంత్ రెడ్డికి బెయిల్ దక్కడంతోనే ఆయన అభిమానులు ఆనందంగా సంబరాలు చేసుకుంటున్నారు. 
 
మరికొందరు మరో అడుగు ముందుకేసి ఆయనకు స్వాగతం పలుకుతూ వివిధ ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటిల్లో కొన్ని ప్రతి ఒక్కరినీ అమితంగా ఆకట్టుకుంటున్నాయి. అందులో ఒకటే ఈ 'ఆట మొదలైంది' అనే రాసిన ఫ్లెక్సీ. ఎన్టీఆర్, చంద్రబాబుల చిత్రాలతో పాటు ఓ పెద్దపులి బొమ్మ, రేవంత్ చిత్రం ఉన్న ఈఫ్లెక్సీపై 'ఆట మొదలైంది' అని రాశారు.
 
హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో ఈ ఫ్లెక్సీ కనిపిస్తోంది. స్వతహాగా అధికార తెలంగాణను నిలదీస్తూ, తనదైన శైలిలో విరుచుకుపడే తమ నేత ఇకపై సమస్యలను పరిష్కరించే దిశగా మరింతగా స్పందిస్తారని, తనకు జరిగిన అన్యాయానికి ఎదురొడ్డి నిలిచి పోరాడతారని చెప్పేందుకే ఈ ఫ్లెక్సీలు ముద్రించినట్టు రేవంత్ అభిమానులు వివరణ ఇస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu