Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైదరాబాద్ విడిచి పారిపోయిన మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి!

హైదరాబాద్ విడిచి పారిపోయిన మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి!
, శుక్రవారం, 19 డిశెంబరు 2014 (09:48 IST)
తెలంగాణ రాష్ట్రానికి చెందిన కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి, ఆయన అంగరక్షకుడిపై జరిగిన దాడి కేసులో జూబ్లీహిల్స్ మాజీ ఎంఎల్ఏ విష్ణువర్థన్ రెడ్డి హైదరాబాద్ విడిచి పారిపోయాడు. వాస్తవానికి ఈ కేసులో ఆయనను అరెస్టు చేయడానికి గురువారం ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులకు ఝులక్ ఇచ్చిన విషయం తెల్సిందే. 
 
పోలీసుల రాకను ముందుగానే తెలుసుకున్న విష్ణువర్ధన్ రెడ్డి తన రెండు మొబైల్ ఫోన్లను స్విచాఫ్ చేసి.. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని తన స్నేహితుని వద్ద తలదాచుకున్నట్టు తెలుస్తోంది. 
 
కాగా, రంగారెడ్డి కోర్టులో విష్ణు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ శుక్రవారం విచారణకు రానుంది. విష్ణుకు బెయిల్ లభించకుంటే, ఆయన పరారీలో ఉన్నట్టు ప్రకటించి, అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను నియమించాలని హైదరాబాద్ నగర పోలీసులు భావిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu