Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆస్పత్రి బిల్లు చెల్లించేందుకు కన్నబిడ్డను విక్రయించిన తల్లిదండ్రులు!

ఆస్పత్రి బిల్లు చెల్లించేందుకు కన్నబిడ్డను విక్రయించిన తల్లిదండ్రులు!
, శనివారం, 18 ఏప్రియల్ 2015 (11:23 IST)
ఆస్పత్రిలో వైద్యం చేయించుకునేందుకు ఓ కాంట్రాక్టు కార్మికుడు కన్నబిడ్డను అమ్ముకున్న సంఘటన తాజాగా అదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ హృదయ విదాకర సంఘటన వివరాలను పరిశీలిస్తే... ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌ నగర్‌లోని సర్‌ సిల్క్ కాలనీకి చెందిన కాంట్రాక్టు కార్మికుడు ఎస్పీఎంలో పని చేసేవాడు. మిల్లు మూతపడడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. నాలుగు రోజుల క్రితం అతని భార్య స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో పండంటి మగశిశువుకు జన్మనిచ్చింది.
 
ఈ నేపథ్యంలో ఆస్పత్రి బిల్లు 13 వేలు వచ్చింది. దీనిని కట్టలేక అతను బిడ్డను హైదరాబాదుకు చెందిన ఒక వ్యాపారికి అమ్మేశాడు. సదరు వ్యాపారి ఆసుపత్రి బిల్లుతో పాటు, వారి కష్టాలను గట్టెక్కించేందుకు మరికొంత నగదు కూడా అందజేసినట్టు తెలుస్తోంది. కొడుకును అమ్ముకునేందుకు కాగజ్‌ నగర్ మున్సిపాలిటీ ఉద్యోగి మధ్యవర్తిత్వం నెరిపినట్లు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu