Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆమె నన్ను ఎన్‌కౌంటర్‌ చేస్తానన్నారు... భయమేస్తోంది... కేసీఆర్ ప్రభుత్వం నన్నాదుకోవాలి... నటి పూజిత

బుల్లితెర ప్రేక్షకులకు పూజిత అంటే బాగా తెలుసు. ఆ తర్వాత ఆమె వెండితెరపైన కూడా పలు చిత్రాల్లో నటించింది. ఇప్పుడు ఆమె మీడియా ముందుకు రావడంతో ఆమెకు సంబంధించిన సంగతులన్నీ బయటకు వస్తున్నాయి. తన భర్త విజయ్ తనను మోసం చేసి మరో ఐఏఎస్ ఆఫీసర్ ను పెళ్లాడుతున్నాడన

ఆమె నన్ను ఎన్‌కౌంటర్‌ చేస్తానన్నారు... భయమేస్తోంది... కేసీఆర్ ప్రభుత్వం నన్నాదుకోవాలి... నటి పూజిత
, మంగళవారం, 3 మే 2016 (17:03 IST)
బుల్లితెర ప్రేక్షకులకు పూజిత అంటే బాగా తెలుసు. ఆ తర్వాత ఆమె వెండితెరపైన కూడా పలు చిత్రాల్లో నటించింది. ఇప్పుడు ఆమె మీడియా ముందుకు రావడంతో ఆమెకు సంబంధించిన సంగతులన్నీ బయటకు వస్తున్నాయి. తన భర్త విజయ్ తనను మోసం చేసి మరో ఐఏఎస్ ఆఫీసర్ ను పెళ్లాడుతున్నాడనీ, తనకు న్యాయం చేయాలని ఐపీఎస్‌ ఆఫీసర్‌ అంజనా సిన్హాను వేడుకుంటే ఆమె తనను ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించారని ఆమె ఆరోపించడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. 
 
కాగా తనకు తన భర్త నుంచి ప్రాణ హాని ఉన్నదనీ, అతడిపై క్రిమినల్ కేసులను చూస్తే అతడితో చాలా అపాయం అని తెలుస్తుందనీ, తనకు న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపైన నగర సీపీ మహేందర్ రెడ్డిని ఆశ్రయించగా తగిన ఆధారాలు చూపించాలన్నారనీ, ఆ ఆధారాలను ఆయనకు సమర్పించినట్లు తెలిపారు. తనను ఆదుకోవాలని ప్రభుత్వానికి కూడా విన్నవిస్తున్నట్లు ఆమె తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుడిలో కేసీఆర్ విగ్రహం ఏర్పాటు... పథకాలకు చంద్రన్న పేరు లింకులు... ఏంటో ఇది...