Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

15 యేళ్ల బాలికతో వ్యభిచారం చేయించిన బావ అరెస్టు!

15 యేళ్ల బాలికతో వ్యభిచారం చేయించిన బావ అరెస్టు!
, శుక్రవారం, 19 సెప్టెంబరు 2014 (13:45 IST)
హైదరాబాద్‌లోని పాతబస్తీలో 15 యేళ్ల ముస్లిం బాలికతో వ్యభిచారం చేయిస్తూ, ధనార్జన చేస్తూ వచ్చిన బాధితురాలి బావ అక్బర్‌ను హైదరాబాద్ నగర పోలీసులు అరెస్టు చేశారు. అలాగే మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. పాతబస్తీ యాకుత్పురా ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలికను ఆమె తల్లి, బావ కలిసి బలవంతంగా వ్యభిచారం రొంపిలోకి దించిన విషయం తెల్సిందే. 
 
ఈ వృత్తిలో భాగంగా వేర్వేరు ప్రాంతాలకు పంపుతూ బాలికతో వ్యభిచారం చేయిస్తూ, డబ్బులు సంపాదిస్తూ వచ్చారు. అయితే, ఆమె గురువారం తెల్లవారుజామున ఓ విటుని ఇంటి నుంచి తప్పించుకుని వివిధ రైల్వే స్టేషన్లలో తలదాచుకుంటూ చివరకు పీయూసీఎల్ కార్యాలయానికి చేరుకుని అక్కడ ఆశ్రయం పొందింది. దీనిపై పీయూసీఎల్ మహిళా నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు.. బాలిక బావ అక్బర్తో పాటు మరో ఇద్దరిని పోలీసులు ఫలక్నూమాలో అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu